Apple Days Sale అమెజాన్‌లో ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు..!
అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆపిల్ డేస్ పేరుతో ప్రత్యేకంగా ఆపిల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ సేల్ జూన్ 17 వరకు కొనసాగనుంది. ఆపిల్ 14 సీరిస్ ఫోన్లపై డిస్కౌంట్లు సహా బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజి ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 : అమెజాన్ ఆపిల్ డేస్ ప్రత్యేక సేల్‌లో భాగంగా 128GB వేరియంట్ ధర రూ.67,999కే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర 79,999 రూపాయలుగా ఉంది. అంటే సుమారు 15 శాతం డిస్కౌంట్ ఐఫోన్ 14 లభిస్తుంది.

అలాగే ఐఫోన్ 14 256GB ధర రూ.77,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.89,900 గా ఉంది. అంటే 256GB వేరియంట్ ధరపై 13 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 512GB ఫోన్ అసలు ధర రూ.1,09,900గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే 11 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.97,999కే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్ : ఐఫోన్ 14 ప్లస్.. 128GB వేరియంట్ అసలు ధర రూ.89,900గా ఉంది. ఆపిల్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే 14 డిస్కౌంట్ పొందవచ్చు. అంటే కేవలం రూ.76,999కే కొనుగోలు చేయవచ్చు. 256GB ఫోన్ అసలు ధర రూ.99,900గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే 13 శాతం డిస్కౌంట్‌తో 86,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 14 ప్రో : ఐఫోన్ 14 ప్రో 128GB వేరియంట్ అసలు ధర రూ.1,29,900.. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే కేవలం 1,19,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా 256GB వేరియంట్ అసలు ధర రూ. 1,39,900 ఉంది. అదే ఆపిల్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.1,34,990కే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్: ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 128GB వేరియంట్ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.1,39,900గా ఉంది. ఆపిల్ సేల్‌లో భాగంగా 1,27,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. 256GB వేరియంట్ అసలు ధర రూ.1,49,900 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.1,43,990 కే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఈ డిస్కౌంట్లతో పాటు బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజీ ద్వారా మరింత తక్కువ ధరకే ఐఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆపిల్ సేల్ జూన్ 17 వరకు అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications