Amazon Black Friday Sale అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024 ప్రారంభం.. ఈ గ్యాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్‌లు..!
మరో నెల రోజుల్లో ఈ సంవత్సరం పూర్తికానుంది. అందువల్ల ఇ-కామర్స్ సంస్థలతోపాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. గతంలో దసరా, దీపావళికి ప్రత్యేక సేల్‌లు నిర్వహించిన ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon).. తాజాగా మరో సేల్ ను ఇవాళ్టి నుంచి ప్రారంభంచింది. ఈ సేల్‌లో భాగంగా అనేక గ్యాడ్జెట్‌లు సహా ఉత్పత్తులపై డిస్కౌంట్‌లు, ఆఫర్‌లను అందిస్తోంది. పూర్తి వివరాలు.
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024 ను (Amazon Black Friday Sale 2024) ప్రారంభించింది. ఈ సేల్ ఇవాళ్టి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా గ్యాడ్జెట్‌లు, గృహోపకరణాలు సహా ఉత్పత్తులను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 40-75 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందవచ్చని అమెజాన్ చెబుతోంది.

గరిష్ఠంగా 65 శాతం డిస్కౌంట్! :
దీంతోపాటు ఇతర గృహోపకరణాలపై 65 శాతం డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ అమెజాన్ బ్లాక్ ఫ్లైడే సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌లతోపాటు బ్యాంకు కార్డులతో మరింత డిస్కౌంట్‌లను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లు క్యాష్‌బ్యాక్‌లతోపాటు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
ఈ అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా HSBC, HDFC, ఇండస్‌ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ కార్డులపై EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్లు.. అమెజాన్ బ్రాండ్ సంబంధిత క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు.
ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్, విడి భాగాలపై గరిష్ఠంగా 40 శాతం, హోమ్ మరియు కిచెన్ ఉత్పత్తులపై 60 శాతం, స్మార్ట్‌టీవీలపై గరిష్ఠంగా 65 శాతం, అలెక్సా మరియు ఫైర్ టీవీ 25 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, సోనీ, రియల్‌మి సహా అనేక బ్రాండ్ల ఉత్పత్తులను తగ్గింపు ధరలను పొందవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా ఆపిల్ ఉత్పత్తులు సహా శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో, శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, సోనీ ప్లే స్టేషన్, షియోమీ స్మార్ట్‌టీవీ, అమేజ్‌ఫిట్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్‌ను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు మరిన్ని బ్రాండ్‌ల ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 200MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. మరియు అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు 6.8 అంగుళాలు QHD+ అమోలెడ్ డిస్‌ప్లే తో పనిచేస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS తో పనిచేస్తుంది. 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.74999 గా ఉంది.


Click it and Unblock the Notifications