Home
News

అమెజాన్‌ బ్లాక్‌బస్టర్‌ వాల్యూ డేస్‌ సేల్‌.. వాటిపై భారీ డిస్కౌంట్లు..!

ప్రముఖ ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ మరో సేల్‌తో ముందుకు వచ్చింది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌, ల్యాప్‌టాప్‌, హెడ్‌ఫోన్లు సహా గృహ ఉపకరణాలపై భారీ ఆఫర్లు సహా డిస్కౌంట్లు ప్రకటించింది. శుక్రవారం ప్రారంభం అయిన అమెజాన్‌ 'బ్లాక్‌ బస్టర్‌ వాల్యూ డేస్‌' సేల్‌ ఈనెల 24 వరకు కొనసాగనుంది. అంతేకాకుండా కొన్ని బ్యాంకుల కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తోంది.

అమెజాన్‌ సేల్‌లో భాగంగా ల్యాప్‌ట్యాప్‌,హెడ్‌ఫోన్లు, కంప్యూటర్‌ ఉపకరణాలపై అమెజాన్‌ భారీగా ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్‌, హెచ్‌పీ, ఫైర్‌బోట్‌, మరియు బోట్‌ సహా బ్రాండ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో HDFC బ్యాంక్‌ కార్డులు కలిగిన వారు 10 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చని తెలిపింది.

Amazon Blockbuster value days

ఈ అమెజాన్‌ 'బ్లాక్‌బస్టర్‌ వాల్యూ డేస్‌' సేల్‌ సందర్భంగా ల్యాప్‌టాప్‌లపై ఉత్తమ డీల్‌ను కనుగొనవచ్చు. మీరు శక్తివంతమైన లేదా ఆల్ట్రాబుక్‌ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజ్‌పై సుమారు రూ.18,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మరియు 6 నెలల వరకు నో కాస్ట్‌ EMIలను పొందవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ బుక్‌2 ప్రో సాధారణ సమయాల్లో ధర రూ. 1,39,999.. అదే ఈ సేల్‌లో కేవలం రూ.1,05,990కే కొనుగోలు చేయవచ్చు. 12 జనరేషన్‌ intel EVoTM Core i7-1260P ప్రొసెసర్‌పై ఈ ట్యాప్‌టాప్‌ పనిచేస్తుంది. ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ను కూడా కలిగి ఉంటుంది.

HP విక్టస్‌ AMD Ryzen7 5800H గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ ధర సాధారణ సమయాల్లో రూ.92.395 ఉంటుంది. అదే ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే కేవలం రూ.67,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

Dell vostro 3510 ల్యాప్‌టాప్‌ సాధారణ సమయాల్లో ధర రూ.69,210 ఉంటుంది. అదే సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే 52,990 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ intel core i5-1135G7 11 జనరేషన్‌ ప్రొసెసర్‌తో రానుంది. ఎక్స్‌ప్రెస్‌ ఛార్జ్‌ టెక్నాలజీతో వస్తుంది.

షియోమీ నోట్‌బుక్‌ ప్రో ల్యాప్‌టాప్‌ ధర సాధారణ సమయాల్లో ధర రూ.69,999 కు అందుబాటులో ఉంటుంది. అదే ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే కేవలం రూ.51,499 కే సొంతం చేసుకోవచ్చు. QHD+ ఐపీఎస్‌ డిస్‌ప్లేతో రానుంది. intelcore i5-1130H 11వ జనరేషన్‌ ప్రొసెసర్‌ను కలిగి ఉంటుంది.

ASUS TUF A15 ల్యాప్‌టాప్‌ ధర సాధారణ సమయాల్లో 71,990 రూపాయలు ఉంటే.. అదే ఈ అమెజాన్‌ వాల్యూడేస్ సేల్‌లో భాగంగా రూ.49,990 కే కొనుగోలు చేయవచ్చు. గృహ ఉపకరణాలు, పలు రకాల టీవీలు, వీటితోపాటు పలు బ్రాండ్ల గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అమెజాన్‌ ప్రకటించింది. ఈ సేల్‌ మే నెల 24 వరకు ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Blockbuster value days big discounts on laptops and smartwatches
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X