కస్టమర్‌కు షాక్ ఇచ్చిన అమెజాన్.. 90 వేల విలువైన కెమెరా లెన్స్ ఆర్డర్ చేస్తే...!
ఓ అమెజాన్ వినియోగదారుడు తనకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ పెట్టాడు. వాటి డెలివరీ కోసం తెగ ఎదురుచూశాడు. తీరా ఆ డెలివరీ చేతికొచ్చాక.. వచ్చిన వస్తువులను చూసి షాక్ అయ్యాడు. దీంతో ఏం చేయాలో తెలియక ట్విట్టర్ ద్వారా అమెజాన్‌కు ఫిర్యాదు చేశారు.
అరుణ్‌కుమార్ మెహర్ అనే అమెజాన్ వినియోగదారుడు ఈ నెల తొలివారంలో రూ.90,000 విలువ చేసే సిగ్మా 24-70 f2.8 కెమెరా లెన్స్‌లను ఆర్డర్ చేశారు. జులై 6వ తేదీన ఆర్డర్ డెలివరీని పొందాడు. అయితే పార్సిల్ తెరవగానే కెమెరా లెన్స్‌లకు బదులుగా క్వినోవా విత్తనాలు ఉన్నాయని అరుణ్ ఆరోపించాడు.

వెంటనే అమెజాన్ సహా సంబంధిత విభాగాలకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. తాను 90 వేల రూపాయల విలువైన కమెరా లెన్స్‌లను ఆర్డర్ చేయగా.. విత్తనాలు డెలివరీగా వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరాడు. అరుణ్‌కుమార్ మెహర్ ఫిర్యాదుపై అమెజాన్ స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించింది. వీలైనంత త్వరగా తన సమస్యలను పరిష్కరించాలని, లేదా తాను చెల్లించిన నగదును వెనక్కి ఇవ్వాలని అరుణ్ కోరాడు.
అరుణ్ ట్వీట్‌పై ఓ నెటిజన్ స్పందించాడు. డిలివరీ సమస్యలను అమెజాన్ నియంత్రించలేకపోతోందని ట్వీట్ చేశాడు. తాను గతంలో స్వీకర్లను ఆర్డర్ చేస్త్.. ఇంటికి బియ్యం వచ్చాయని చెప్పుకొచ్చాడు. అమెజాన్‌లో అధిక ధర కలిగిన వస్తువులను ఆర్టర్ చేసిన వినియోగదారులు ఆందోళన చెందాల్సి వస్తోందని చెప్పాడు.
అరుణ్ ట్వీట్‌పై మరో యూజర్ కూడా కామెంట్ చేశాడు. తనకు డ్యామేజి అయిన మొబైల్‌ను డెలివరీ చేశారని చెప్పుకొచ్చాడు. దీనిపై అమెజాన్‌ను ప్రశ్నిస్తే.. తయారీదారుడు, విక్రయించిన సంస్థలపై నెట్టే ప్రయత్నం చేశారని చెప్పాడు. తాను అమెజాన్‌కు నగదు చెల్లించానని, కానీ వారు సరిగా స్పందించలేదని ఆరోపించాడు. Appario నుంచి అధిక విలువైన ఉత్పత్తులు ఆర్డర్ చేసిన వాళ్లు ఎక్కువగా మోసపోతున్నారని ఓ ట్విట్టర్ యూజర్ ఆరోపించాడు.
* జులై 15 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం అయింది. జులై 16 అర్ధరాత్రి 12 గంటల వరకు సేల్ కొనసాగనుంది. కేవలం ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారు మాత్రమే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్లు, కంప్యూటర్ విడిభాగాలు, ఇతర గృహోపకరణాలు సహా అనేక రకాల ఉత్పత్తులపై అత్యుత్తమ ఆఫర్లు అందిస్తోంది.
ప్రత్యేకంగా కొన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై మంచి ఆఫర్లను కలిగి ఉన్నాయి. అమెజాన్‌లో ఎంపిక చేసిన వస్తువులను ICICI మరియు SBI బ్యాంక్ క్రెడిట్, డిబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులు 10 శాతం డిస్కౌంట్ పొందనున్నారు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్లు ఆపిల్, శాంసంగ్, మోటోరొలా, ఐకూ, రియల్‌మీ, వన్‌ప్లస్, సహా ఇతర ఫోన్లపై ఈ ప్రైమ్‌డే సేల్‌లో ఉత్తమ ఆఫర్లు ఉన్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








