అమెజాన్‌లో మారణాయుధాలు: ఘాతుకానికి ఒడిగడుతున్న పిల్లలు

Written By:

ఇప్పటివరకు ఈ కామర్స్ మార్కెట్లో మొబైల్స్ అలాగే ఇంటికి కావలిసిన వస్తువులను అమ్మడం మాత్రమే చూసాం. కాని కత్తులను అమ్మడం ఎక్కడా చూడలేదు. అదీగాక మారణాయుధాలను అమ్మడం కూడా చాలా నేరంతో కూడుకున్నది..దానికి చాలా ఆంక్షలు కూడా ఉన్నాయి. అయితే అమెజాన్ వాటన్నింటిని తుంగలో తొక్కి కత్తులను ఆన్‌లైన్‌లో అమ్ముతోంది. అదీ ఓ బాలునికి కత్తి అమ్మింది. ఇంకేముంది ఆ బాలుడి ఆ కత్తితో తన సహచర విద్యార్థిని పొడిచి చంపేశాడు. ఆసక్తిగొలుపుతున్న కధనం చూడండి.

Read more: కొత్త ఐఫోన్ లీకయ్యింది.. వింటే షాక్ అవుతారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

మారణాయుధాల అమ్మకాలపై ఆంక్షలు ఉండగా.. వాటిని పట్టించుకోకుండా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ విచ్చలవిడిగా కత్తులను అమ్ముతున్నట్టు తేలింది. 18 ఏళ్ల వయస్సు నిండిన వారికి మాత్రమే పలు ఆంక్షలతో కత్తుల వంటి మారణాయుధాలు అమ్మాల్సి ఉంటుంది.

2

కానీ, అమెజాన్‌ మాత్రం బ్రిటన్‌లో ఓ 16 ఏళ్ల బాలుడికి పెద్ద కత్తిని అమ్మింది. మడుచుకోవడానికి వీలుండి.. 8.5 సెంటీమీటర్ల పొడవు బ్లేడ్‌ ఉన్న కత్తిని ఆ బాలుడు 40 పౌండ్లకు అమెజాన్‌లో కొనుగోలు చేశాడు. ఆ కత్తితో స్కూలుకు వెళ్లిన అతను సహచర విద్యార్థిని పొడిచి చంపాడు.

3

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఈ కేసులో నిందితుడైన బాలుడిపై హత్య అభియోగాలను కోర్టు ఎత్తివేసినప్పటికీ, మృతికి కారణమైన అభియోగాలతో అతన్ని విచారించాలని నిర్ణయించింది.

4

18 ఏళ్ల లోపు ఉన్నవారికి మూడు అంగుళాల కన్నా పొడవు ఉన్న కత్తిని అమ్మడం బ్రిటన్‌లో చట్టవిరుద్ధం. అయితే ఆ బాలుడు మాత్రం తాను మేజర్ అని పేర్కొంటూ అమెజాన్‌లో కత్తిని కొనుగోలు చేశాడు.

5

అతని వయస్సు నిర్ధారించుకోకుండానే అమెజాన్‌ అతడికి కత్తిని డెలివరీ చేసింది. తన వయస్సు గురించి ఆరా తీయకుండా ఉండేందుకు ఆ బాలుడు తెలివిగా డెలివరీని ఇక్కడ ఉంచి వెళ్లండి అంటూ తన ఇంటి డోర్‌కు ఓ లేఖను అంటించాడు.

6

డెలివరీ బాయ్‌ అదేవిధంగా చేయడంతో అక్రమంగా కొనుగోలుచేసిన కత్తితో అతడు ఘాతుకానికి ఒడిగట్టాడు. 

7

తాజాగా గార్డియన్ పత్రిక తమ ఆపరేషన్‌లో భాగంగా ఓ ఇంటి చిరునామాతో అమెజాన్‌లో కత్తిని ఆర్డర్ చేసి.. ఆ బాలుడి మాదిరిగా ఆ ఇంటి డోర్‌కు ఓ లేఖను అంటించింది. ఆ లేఖ ప్రకారం కత్తిని డెలివరీ బాయ్ ఆ చిరునామాలో వదిలేసి వెళ్లాడు.

8

దీంతో కత్తుల వంటి మారణాయుధాల అమ్మకాల్లో అమెజాన్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదని, పిల్లలకు విచ్చలవిడిగా మారణాయుధాలు అమ్ముతున్నదని తాజా ఉదంతం రుజువు చేస్తున్నదని గార్డియన్ పత్రిక వ్యాఖ్యానించింది.

9

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Amazon delivering knives without age checks, Guardian investigation finds
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot