అమెజాన్ ప్రైమ్ యూజర్లకు భారీ షాక్, అదీ భారత్‌లో !

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ తన ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లకు భారీ షాక్‌నే ఇవ్వబోతోంది.

By Hazarath
|

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ తన ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లకు భారీ షాక్‌నే ఇవ్వబోతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసులకు భారత్‌లో ఎంతో ప్రాముఖ్యం ఉన్నసంగతి తెలిసిందే.. ఇప్పటి వరకు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలంటే ఆ ధర రూ.499 మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ఈ ఛార్జీని అమెజాన్‌ రెండింతలు చేయబోతుంది.

 

ఉచితంతో ఊడ్చుకుపోలేదు, తరాలు తిన్నా తరగని ఆస్తి, మళ్లీ వన్ అతనేఉచితంతో ఊడ్చుకుపోలేదు, తరాలు తిన్నా తరగని ఆస్తి, మళ్లీ వన్ అతనే

సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసు ప్రైమ్‌ ధరను రూ.999కు..

సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసు ప్రైమ్‌ ధరను రూ.999కు..

అమెజాన్‌ ఇండియా త్వరలోనే తన పాపులర్‌ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసు ప్రైమ్‌ ధరను రూ.999కు పెంచబోతున్నట్టు రిపోర్టులు తెలియజేస్తున్నాయి. గతేడాది జూలైలో ఈ సర్వీసులను అమెజాన్‌ లాంచ్‌ చేసింది. అప్పటి నుంచి అన్ని మేజర్‌ సేల్‌ ఈవెంట్లలో ప్రైమ్‌ టాప్-సెల్లింగ్‌ ప్రొడక్ట్‌గా ఉంటోంది.

ఈ సర్వీసు సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను

ఈ సర్వీసు సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను

ప్రస్తుతం ఈ సర్వీసు సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను పెంచుతున్నప్పటికీ అమెరికాలో కంటే భారత్‌లోనే వీటి ధర తక్కువని తెలిసింది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్న సబ్‌స్క్రైబర్లకు అమెజాన్‌ చాలా వేగవంతంగా ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది.

ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌ మూవీలు, టీవీ షోలను..
 

ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌ మూవీలు, టీవీ షోలను..

తొలుత వీరికే సేల్‌ను అమెజాన్‌ ప్రారంభిస్తోంది. అంతేకాక ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌ మూవీలు, టీవీ షోలను కూడా ఈ సబ్‌స్క్రైబర్లకు అందిస్తారు. ఎక్స్‌క్లూజివ్‌ డిస్కౌంట్లు, ఫ్రీ షిప్పింగ్‌, కొన్ని ఉత్పత్తులపై ఫ్రీ నెక్ట్స్‌ డే డెలివరీలు వీరికి లభిస్తాయి.

1.3 మిలియన్‌ ఉత్పత్తులతో ..

1.3 మిలియన్‌ ఉత్పత్తులతో ..

1.3 మిలియన్‌ ఉత్పత్తులతో ప్రైమ్‌ షిప్‌మెంట్లను ప్రారంభించామని, ప్రస్తుతం అవి 11 మిలియన్లకు పెరిగినట్టు అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా అధినేత అక్షయ్‌ సాహి తెలిపారు. ప్రైమ్‌ను మరింత ఆకర్షణీయంగా తయారుచేయడానికి తాము ఎల్లవేళలా కృషిచేస్తామని చెప్పారు.

ప్రతి మూడింటిలో ఒకటి ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్ల నుంచే..

ప్రతి మూడింటిలో ఒకటి ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్ల నుంచే..

అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే ఆర్డర్లలో ప్రతి మూడింటిలో ఒకటి ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్ల నుంచే వస్తుందని తెలిపారు. పండుగ సీజన్‌లో, మేజర్‌ సేల్‌ ఈవెంట్లలో కొనుగోలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు.

కోట్లాస్తి ఉన్నా ధనదాహం తీరడం లేదు : అమెజాన్ బాస్

కోట్లాస్తి ఉన్నా ధనదాహం తీరడం లేదు : అమెజాన్ బాస్

క్లిక్ చేయండి క్లిక్ చేయండి 

Best Mobiles in India

English summary
Amazon to double price of Prime service to Rs 999 more News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X