Amazonలో కొత్తగా మరో సేల్!!! స్మార్ట్‌ఫోన్‌ల మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్
ఇండియాలో ఆన్‌లైన్ అమ్మకాలలో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందించే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇప్పుడు మరొక అమ్మకంతో ముందుకు వస్తున్నది. అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ డిసెంబర్ 22 నుండి ప్రారంభమయి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ అమ్మకంలో ఆపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమి వంటి మరిన్ని బ్రాండ్ల ఫోన్ల మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్‌లను అందివ్వనున్నది. ఈ అమ్మకంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల వినియోగదారులకు EMI లావాదేవీలపై రూ.1,500 వరకు రాయితీ, అద్భుతమైన డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు వంటివి ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ లో డిస్కౌంట్ పొందే స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్ యొక్క మైక్రోసైట్ లో రాబోయే ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ అమ్మకంలో రాయితీ ధరలకు లభించే కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను అమెజాన్ విడుదల చేసింది. ఈ ఫోన్లలో ఐఫోన్ 11, వన్‌ప్లస్ 8T , వన్‌ప్లస్ నార్డ్, శామ్‌సంగ్ గెలాక్సీ M51, శామ్‌సంగ్ గెలాక్సీ M21, శామ్‌సంగ్ గెలాక్సీ M31, రెడ్‌మి 9 ప్రైమ్, రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ వంటివి ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ల మీద లభించే తగ్గింపు ధరల వివరాలను డిసెంబర్ 19 న అమెజాన్ వెల్లడించనున్నది. డిసెంబర్ 22 మంగళవారం నుండి ప్రారంభమయి క్రిస్మస్ రోజు వరకు ఈ అమ్మకాలు జరగనున్నాయి.

అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో జాబ్రా ఉత్పత్తులపై 70% డిస్కౌంట్
అమెజాన్ ప్రస్తుతం జాబ్రా డేస్ అమ్మకాన్ని నిర్వహిస్తున్నది. ఈ అమ్మకాన్ని డిసెంబర్ 25 వరకు కొనసాగించనుంది. కావున ఈ సమయంలో జబ్రా యొక్క అన్ని ఉత్పత్తుల మీద 70 శాతం వరకు డిస్కౌంట్ లభించనున్నాయి. అలాగే ఇ-కామర్స్ దిగ్గజం ప్రస్తుతం ఇటీవల లాంచ్ చేసిన ఫోన్ల మీద డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.1000 తగ్గింపుతో రూ.12,999 ధర వద్ద అందిస్తోంది.


Click it and Unblock the Notifications








