Amazon Fab Phones Fest 2021లో రెడ్‌మి ఫోన్‌ల మీద ఊహించని ఆఫర్లు
ఇండియాలోని ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సంస్థ అమెజాన్ తన యొక్క ప్లాట్‌ఫామ్‌లో నేడు మరొక సేల్ తో ముందుకు వచ్చింది. అమెజాన్ 'ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్' పేరుతో ప్రారంభం అయిన ఈ సేల్స్ లో అనేక స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ కొత్త అమ్మకం ఈ రోజు అంటే మార్చి 22 నుండి ప్రారంభమై మరొక మూడు రోజుల పాటుగా అంటే మార్చి 25 వరకు కొనసాగనున్నాయి. ఈ అమ్మకంలో కొనుగోలుదారులు అధికంగా షియోమి సంస్థ యొక్క రెడ్ మి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై అధిక మొత్తంలో డిస్కౌంట్ లను పొందగలరు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ఆఫర్స్
'అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్' అమ్మకం సమయంలో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు రాయితీ పొందుతారు. అదనంగా ఇ-టైలర్ నో-కాస్ట్ EMI ఆప్షన్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్లు మరియు బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తుంది. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద 10% వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేసిన వారికి తమ యొక్క కొనుగోలు మీద అధిక మొత్తంలో క్యాష్ బ్యాక్ లు లభిస్తాయి.

రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌లపై క్యాష్ బ్యాక్
అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ అమ్మకంలో షియోమి సంస్థ యొక్క రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఎప్పుడు లేని విధంగా ఊహించని రీతిలో డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. రెడ్‌మి 9 ఫోన్ ను రూ.6,799 ధరకే అందించడం గమర్హం. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులు రూ.2000 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రెడ్‌మి 9 ప్రైమ్ రూ.9,499 ప్రారంభ ధర వద్ద, రెడ్‌మి 9 పవర్ రూ.10,499 మరియు రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ రూ.14,999 తక్కువ ధర వద్ద జాబితా చేయబడ్డాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నిటి మీద క్యాష్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ యొక్క కొత్త సేల్ 'ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్' అమ్మకంలో స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీదనే కాకుండా షియోమి సంస్థ యొక్క Mi పవర్ బ్యాంకుల మీద కూడా 40% వరకు తగ్గింపును అందిస్తున్నాయి. 20000mAh సామర్ధ్యం గల Mi పవర్ బ్యాంక్ 3i ను ప్రస్తుత అమ్మకంలో కేవలం రూ.1499 తగ్గింపు ధర వద్దనే పొందవచ్చు. అలాగే ఈ అమ్మకంలో వన్‌ప్లస్ 8 ప్రో, వన్‌ప్లస్ 8T వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై కూడా అమెజాన్ డిస్కౌంట్ ధరల వద్ద అందిస్తున్నది.


Click it and Unblock the Notifications








