రూ.1999కే అమెజాన్ టీవీ, నేడే మార్కెట్లోకి..?

భారత్‌లో ఆన్‌లైన్ టీవీ కంటెంట్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో అమెజాన్, ఫైర్ టీవీ పేరుతో టీవీ స్ట్రీమింగ్ స్టిక్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఈ ప్లగ్ అండ్ ప్లే డివైస్‌ను టీవీలకు కనెక్ట్ చేసుకోవటం ద్వారా నచ్చిన ఆన్‌లైన్ కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకునే వీలుంటుంది.

కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? లేటెస్ట్‌గా ధర తగ్గిన ఫోన్స్ ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్ ఫైర్ టీవీ స్పెసిఫికేషన్స్..

క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వై-ఫై, బ్లుటూత్ 4.1, డాల్బీ 5.1 అవుట్ పుట్, ఆప్షనల్ గేమ్ కంట్రోలర్, HEVC, 1080 పిక్సల్ అవుట్ పుట్ వంటి స్పెసిఫికేషన్‌లను ఈ టీవీలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

2014లో లాంచ్ అయ్యింది...

వాస్తవానికి, అమెజాన్ తన ఫైర్ టీవీని 2014లోనే పరిచయం చేసింది. ఇండియాలో లాంచ్ కాబోతోన్న ఫైర్ టీవీ మోడల్‌లో Alexa పేరుతో వాయిస్ కంట్రోల్డ్ డిజిటల్ అసిస్టెంట్ ఫీచర్‌ను అమెజాన్ ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నట్లు సమాచారం.  

ధర రూ.1,999 మాత్రమే..

భారత్‌లో అమెజాన్ ఫైర్ టీవీ ధర రూ.1,999గా ఉండొచ్చని సమాచరం. ఇదే గనుక నిజమైతే గూగుల్ క్రోమ్ కాస్ట్ (రూ.3,999), యాపిల్ టీవీ (రూ.13,500)లకు అమెజాన్ ఫైర్ టీవీ ప్రధాన పోటీదారుగా నిలుస్తుంది.

46 కోట్ల కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్లు..

46 కోట్ల కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్లను కలిగి ఉన్న ఇండియాలో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీసులు ఇప్పటికే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. వీటీకి పోటీగా అమెజాన్ ఇటీవల ప్రైమ్ వీడియో సర్వీసును మార్కెట్లోకి తీసుకువచ్చింది.

అమెజాన్ వ్యూహంగా తెలుస్తోంది

మరికొద్ది గంటల్లో లాంచ్ చేయబోయే ఫైర్ టీవీ ద్వారా ప్రైమ్ వీడియో సర్వీసులను మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నది అమెజాన్ వ్యూహంగా తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Fire TV to be launched today at Rs.1,999: What we know so far. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot