Home
News

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ లాంచ్ అయింది!! ప్రత్యేకత ఏమిటో తెలుసా??

అమెజాన్ తన ఫైర్ టీవీ స్టిక్ రేంజ్ స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్‌లను విస్తరించడానికి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ అనే సరికొత్త మోడల్‌ని పరిచయం చేసింది. దాని యొక్క పేరుకు సూచించినట్లుగా కొత్త ఫైర్ టీవీ స్టిక్ వెర్షన్ ఇప్పటికే ఉన్న ఫైర్ టీవీ స్టిక్ 4K కి అప్‌గ్రేడ్‌గా అందుబాటులోకి వస్తుంది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ వేగవంతమైన అనుభవం మరియు తదుపరి తరం Wi-Fi 6 కనెక్టివిటీతో ఇంకా ఉత్తమ స్ట్రీమింగ్ స్టిక్ అని పేర్కొంది. ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ అనేది ఫైర్ టీవీ స్టిక్ కుటుంబంలో డాల్బీ విజన్ ఫార్మాట్‌ను సపోర్ట్ చేసిన మొట్టమొదటిది కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Fire TV స్టిక్ 4K మాక్స్ ధర మరియు లభ్యత వివరాలు

Amazon Fire TV స్టిక్ 4K మాక్స్ ధర మరియు లభ్యత వివరాలు

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ భారతదేశంలో రూ.6,499 ధర వద్ద లాంచ్ అయింది. ఇది ప్రస్తుతం Amazon.in ద్వారా ప్రీ-ఆర్డర్‌లతో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మాల్‌లలో అమెజాన్ కియోస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే అక్టోబర్ 7 నుండి వీటి యొక్క రవాణా ప్రారంభమవుతుంది. ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్‌తో పాటు అమెజాన్ భారతదేశంలో సాధారణ ఫైర్ టీవీ స్టిక్ 4K ని రూ.5,999 ధర వద్ద మరియు ఫైర్ టీవీ స్టిక్ (3వ తరం) రూ.3,999 ధర వద్ద చివరిగా ఫైర్ టీవీ స్టిక్ లైనప్‌లో రూ.2,999 చౌకైన ధర వద్ద ఫైర్ టీవీ స్టిక్ లైట్ అందుబాటులో ఉంది.

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ స్పెసిఫికేషన్‌లు

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ స్పెసిఫికేషన్‌లు

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ ఫైర్ టీవీ స్టిక్ 4K కంటే 40 శాతం ఎక్కువ శక్తివంతమైనదని సంస్థ పేర్కొన్నది. ఇది క్వాడ్-కోర్ మీడియాటెక్ MT8696 SoC వద్ద రన్ అవుతూ 1.8GHz వద్ద క్లాక్ చేయబడి ఉండడమే కాకుండా 2GB RAM మరియు 750MHz IMG GE8300 GPU తో జత చేయబడి ఉంది. మరోవైపు ఫైర్ టీవీ స్టిక్ 4K 1.7GHz వద్ద క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు 1.5GB RAM మరియు 650MHz వద్ద IMG GE8300 GPU ని కలిగి ఉంది. అమెజాన్ ఫైర్ టివి స్టిక్ 4K మాక్స్ మరియు ఫైర్ టివి స్టిక్ 4K రెండింటిలోనూ 8GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది.

ఫైర్ టీవీ స్టిక్

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ వేగవంతమైన ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు Wi-Fi 6 కనెక్టివిటీని ప్రారంభించడానికి MediaTek MT7921LS చిప్‌సెట్‌ని కలిగి ఉంటుంది. ఇది Wi-Fi 802.11ac (Wi-Fi 5) తో ఉన్న ఫైర్ టీవీ స్టిక్ 4K కి భిన్నంగా ఉంటుంది. Wi-Fi 6 సపోర్ట్ స్ట్రీమింగ్‌లో ఎలాంటి లాగ్ లేకుండా సున్నితమైన అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుంది. అయితే అంతర్నిర్మిత Wi-Fi 6 మద్దతును యాక్సెస్ చేయడానికి మీకు అనుకూల రౌటర్ అవసరం.

ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్

ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ అనుకూలతను కలిగి ఉంది మరియు Wi-Fi 802.11 a/b/g/n/ac నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. బ్లూటూత్ స్పీకర్‌లు, హెడ్‌ఫోన్‌లు మరియు వీడియో గేమ్ కంట్రోలర్లు వంటి అనుకూల పరికరాలతో జత చేయడానికి మద్దతుతో పాటుగా బ్లూటూత్ v5.0 కూడా ఉంది. అదనంగా Wi-Fi 6 తో పాటు ఫైర్ TV స్టిక్ 4K మాక్స్ మరియు ఫైర్ టీవీ స్టిక్ 4K ల మధ్య ఉన్న ఇతర ప్రధాన వ్యత్యాసం డాల్బీ విజన్‌కు మద్దతు ఇస్తుంది. వాస్తవానికి మార్పును అనుభవించడానికి మీకు డాల్బీ విజన్ ఫార్మాట్‌లో కంటెంట్ అవసరం.

HDR10

HDR10 మరియు HDR10+తో సహా ఇతర ఫార్మాట్‌లకు కూడా మద్దతు ఉంది. ఇంకా కొత్త ఫైర్ టీవీ స్టిక్ డాల్బీ అట్మోస్‌కు అనుకూలమైన టీవీ యూనిట్‌లలో అద్భుతమైన సౌండ్ అనుభవం కోసం మరియు ఎంచుకున్న కంటెంట్ కోసం మద్దతును కలిగి ఉంది. అమెజాన్ 3వ తరం అలెక్సా వాయిస్ రిమోట్- ఫైర్ టివి స్టిక్ 4K మాక్స్‌తో మార్చిలో ప్రారంభించబడింది. రెగ్యులర్ ఫైర్ టీవీ స్టిక్‌లో కూడా ఇది అందుబాటులో ఉంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ మరియు నెట్‌ఫ్లిక్స్‌లను త్వరగా యాక్సెస్ చేయడానికి అంకితమైన బటన్‌లను కలిగి ఉంటుంది. మీ ఇన్‌స్టాల్ చేసిన అన్ని యాప్‌లను యాక్సెస్ చేయడానికి రిమోట్‌లో బటన్ కూడా ఉంది.

అమెజాన్

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ లైవ్ వ్యూ ఫీచర్‌కి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది వినియోగదారులు తమ టీవీలో ఇతర కంటెంట్‌లను ప్లే చేస్తున్నప్పుడు వారి వీడియో డోర్‌బెల్స్ మరియు సెక్యూరిటీ కెమెరాల యొక్క పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీడ్‌ను అమలు చేయడానికి అనుమతిస్తుంది. ఫీచర్ ఎంపిక స్మార్ట్ హోమ్ మరియు సెక్యూరిటీ పరికరాలతో పనిచేస్తుంది మరియు ఫైర్ టీవీ క్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ ఫైర్ టివి స్టిక్ 4K మాదిరిగానే కనిపిస్తుంది. ఇది కూడా 99x30x14mm అదే కొలతల పరిమాణంలో వస్తుంది. దీని బరువు 48.4 గ్రాములు.

Best Mobiles in India

English summary
Amazon Fire TV Stick 4K Max Released in India With Dolby Vision Support: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X