పండుగలు వచ్చేస్తున్నాయి,భారీ స్కెచ్‌ వేస్తున్న అమెజాన్, ప్లిప్‌కార్ట్‌

By Gizbot Bureau
|

మళ్లీ పండుగల హోరు మొదలవబోతోంది. నవరాత్రి, దసరా, దీపావళి పండుగల వరుసగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్, ప్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు భారీ స్కెచ్‌ వేసి అమ్మకాలను రాబట్టుకోవాలని చూస్తున్నాయి. దీంతో గత ఏడాది కంటే ఈసారి అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లలో ఫెస్టివ్ సీజన్ సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు.

Amazon, Flipkart bet big on festive sales spike

పలు ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్, ఫ్యాషన్ బ్రాండ్స్ కంపెనీలు కూడా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కాగా ఆన్‌లైన్ ఫోకస్డ్ బ్రాండ్లు, అలాగే ఫెస్డివ్ ఆర్డర్స్ రెండింతలు అయ్యాయని సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు.

ఆన్ లైన్ సేల్స్ లేదా బ్రాండ్స్ వైపు దృష్టి

ఆన్ లైన్ సేల్స్ లేదా బ్రాండ్స్ వైపు దృష్టి

ఇందులో వారు ప్రధానంగా ఆన్ లైన్ సేల్స్ లేదా బ్రాండ్స్ వైపు దృష్టి సారిస్తారు. ఈ సమయంలో కంపెనీలు, దుకాణాలు కూడా మార్జిన్లు తక్కువగా చూసుకొని డిస్కౌంట్స్ ఇస్తాయని చెబుతున్నారు. ఈ ఏడాది తొలి మెగా ఆన్‌లైన్ ఫెస్టివల్ సేల్ దసరా సందర్భంగా సెప్టెంబర్ నెలలో ప్రారంభమై దీపావళి వరకు అంటే అక్టోబర్ వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. 2019లో 5-6 శాతం వృద్ధి సాధించామని, దీపావళి సందర్భంగా ఉత్పత్తుల వృద్ధి 8-10 శాతం వరకు ఉంటాయని భావిస్తున్నయ్లు రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ అన్నారు.

టీవీ అమ్మకాలు

టీవీ అమ్మకాలు

టీసీఎల్, కొడక్, థామ్సన్, ఇఫాల్కన్ వంటి కంపెనీలు కూడా తమ ఉత్పత్తులు ఈసారి డబుల్ అవుతాయని భావిస్తున్నారు. గత ఏడాది ఇదే పండుగ సీజన్‌లో టీసీఎల్, ఇఫాల్కన్ టెలివిజన్ సేల్స్ 225,000గా ఉండగా, ఈసారి రెండింతల స్టాక్‌కు సిద్ధమయ్యారు. జూన్ - జూలై క్వార్టర్ తర్వాత స్వాతంత్ర దినోత్సవం (ఆగస్ట్ 15) సందర్భంగా టెలివిజన్ సేల్స్ కాస్త సంతృప్తికరంగా ఉన్నాయని థామ్సన్ అండ్ కొడక్ లైసెన్సీ సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ అన్నారు.

ఈ-కామర్స్ అమ్మకాలకు

ఈ-కామర్స్ అమ్మకాలకు

భారతదేశంలో ఈ-కామర్స్ అమ్మకాలకు ప్రధానంగా స్మార్ట్ ఫోన్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, దుస్తులు ఉపయోగపడ్డాయి. ఇవే 80 శాతం ఆన్ లైన్ వ్యాపారం కలిగి ఉన్నాయి. ఆన్‌లైన్ మార్కెట్లోకి విదేశీ ఫండ్స్ నిబంధనలు ప్రభుత్వం కఠినతరం చేసిన నేపత్యంలో సగటు ఆన్ లైన్ విక్రయాలు కాస్త తగ్గాయి. కానీ అందుబాటు షాపింగ్, అందుబాటు ధరలు, వివిధ వెరైటీలు, కొత్త కొత్త షాప్స్ కారణంగా సేల్స్‌లో ఈ-కామర్స్ కాంట్రిబ్యూషన్ ఎక్కువే ఉంది.

 సీజన్లో భారీ ఆఫర్లు

సీజన్లో భారీ ఆఫర్లు

వృద్ధి బాగుందని, పండుగ సీజన్‌లోను ఇది కొనసాగుతుందని భావిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ ఇండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ-కామర్స్ బిజినెస్‌లో తాము కీలకంగా ఉన్నామని, తమ సేల్స్‌లో పెద్దగా మందగమనం లేదని చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఫెస్టివెల్ సీజన్‌లో సేల్స్ డబుల్ ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ-కామర్స్ వెబ్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగల సీజన్లో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. యూజర్లు ఫీచర్ ఫోన్స్ నుంచి స్మార్ట్ ఫోన్ వైపు మరలుతున్నారని, దీని వల్ల సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Best Mobiles in India

English summary
Signs of spark: Amazon, Flipkart bet big on festive sales spike

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X