అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్స్ లో ఆన్‌లైన్ షాపింగ్ ఎంత వరకు ఉపయోగకరం!!

|

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండు కూడా ఆన్‌లైన్ షాపింగ్ కోసం బాగా పాపులర్ అయ్యాయి. దేశంలో ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేసే వారి సంఖ్య మునుపటి కంటే అధికంగా అయింది. ముఖ్యంగా కరోనా వ్యాప్తి సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ మరి ఎక్కువ అయింది. అయితే ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రతి నెల ఎదో ఒక అమ్మకంను అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి. అయితే ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అక్టోబర్ 3 నుంచి వస్తుంటే ఫ్లిప్‌కార్ట్ సంస్థ బిగ్ బిలియన్ డేస్ పేరుతో అదే అక్టోబర్ 3 నుంచి అమ్మకాలను జరపనున్నది.

 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్

అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఆన్‌లైన్ షాపింగ్ ని అధికంగా ఇష్టపడే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని వారికి అందుబాటులోకి తీసుకొని వచ్చే పండుగ సేల్స్ లో వివిధ రకమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశం అంతటా అన్ని ముఖ్యమైన పెద్ద పెద్ద నగరాలలోనే కాకుండ చిన్న చిన్న టైర్ 2&3 పట్టణాలలో కూడా డెలివరిలను అనుకున్న సమయాలలో అందిస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ షాపింగ్ అనేది ఎంత వరకు ఉపయోగకరంగా ఉన్నాయో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆన్‌లైన్ షాపింగ్ లో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
 

ఆన్‌లైన్ షాపింగ్ లో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

ఆన్‌లైన్ షాపింగ్ లో ఎక్కువ కొనుగోలు చేయడానికి ఇష్టపడే వాటిలో ముందువరుసలో ఉన్నవి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు. అన్ని సంస్థలు ఆన్‌లైన్ ద్వారా తమ యొక్క ప్రొడెక్టులను అమ్మకానికి ఉంచుతున్నాయి. అంతేకాకుండా పండుగ సేల్స్ సమయంలో స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు మరియు ఇతర ఎలక్ట్రిక్ వస్తువుల కొనుగోలు మీద డిస్కౌంట్ ఆఫర్లను అందించడంతో పాటుగా ఆన్‌లైన్ బ్యాంక్ పేమెంట్ల మీద క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తున్నాయి.

BSNL భారత్ ఎయిర్‌ఫైబర్ మోడెమ్‌పై ఊహించని అద్భుత ఆఫర్..BSNL భారత్ ఎయిర్‌ఫైబర్ మోడెమ్‌పై ఊహించని అద్భుత ఆఫర్..

ఆన్‌లైన్ షాపింగ్ ప్రయోజనాలు

ఆన్‌లైన్ షాపింగ్ ప్రయోజనాలు

ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడడానికి గల మరొక కారణం ఇంటి వద్దకే ఉచిత డెలివరి లభించడం. ఉదాహరణకు ఆన్‌లైన్ ద్వారా స్మార్ట్ టీవీ, వాషింగ్ మిషన్ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఆర్డర్ చేయడంతో ఈ-కామర్స్ సంస్థలు అందించే డిస్కౌంట్ మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లే కాకుండా ఇంటి వద్దకే ఎటువంటి కష్టం లేకుండా పొందవచ్చు. అదే మీకు దగ్గరలో ఉన్న షాప్ వద్ద కొనుగోలు చేస్తే కనుక దానిని మీ ఇంటి వద్దకు మీరే తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. అలాగే EMI పద్దతిలో కొనుగోలు చేసే ఆప్షన్ కూడా ఉండకపోవచ్చు.

ఆన్‌లైన్ షాపింగ్ లో గుర్తుంచుకోవలసిన విషయాలు

ఆన్‌లైన్ షాపింగ్ లో గుర్తుంచుకోవలసిన విషయాలు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల యొక్క వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు సంస్థ అందించే అన్ని రకాల ప్రయోజనాలను మీరు దృష్టిలో ఉంచుకోవాలి. సంస్థ ప్రతిసారి ఒకే బ్యాంక్ వినియోగదారులకు తగ్గింపు ఆఫర్లను అందివ్వదు. సంస్థ అందిస్తున్న బ్యాంక్ ఆఫర్ల యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను మీరు కలిగి ఉంటే కనుక అధిక ధర గల వస్తువులను EMI పద్దతిలో కొనుగోలు చేస్తే మీకు అధికముగా ప్రయోజనం ఉంటుంది. అలాగే ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు మీకు దగ్గరలో ఉండే షాపులలో మీరు కొనుగోలు చేయాలనుకునే వాటి యొక్క ధరలను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవడం ఉత్తమం. ఆన్‌లైన్ పేమెంట్ చేయడంతో మీకు 10% లేదా 15% వరకు తగ్గింపు ఆఫర్ లభిస్తుంది. కావున క్యాష్ ఆన్ డెలివరి చేయడం కంటే ఆన్‌లైన్ పద్దతిలో పేమెంట్స్ చేయడంతో మీకు కొద్ది మొత్తంలో తగ్గింపు లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్

ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్

ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇన్‌ఫినిక్స్ హాట్ 10S వంటి అగ్ర పరికరాలను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 12,999, కానీ మీరు దానిని కేవలం రూ. 9,499. కి పొందవచ్చు. అంతే కాదు, ఫ్లిప్‌కార్ట్ సేల్ పోకో ఎక్స్ 3 ప్రో వంటి టాప్ ఫోన్‌లను డిస్కౌంట్‌తో అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 23,999 మరియు దీనిని కేవలం రూ. 16,999. కి మీరు పొందవచ్చు.ఇవే కాక ,ఈ జాబితాలో MOTOROLA Edge 20 Fusion మరియు Asus ROG ఫోన్ 3 కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లను కేవలం రూ. 19,999 మరియు రూ.34,999 కి వరుసగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మీరు పొందవచ్చు.ఈ సేల్ లో ఆసుస్ ROG ఫోన్ 3 లో ఇది అత్యుత్తమ డిస్కౌంట్‌లలో ఒకటి కావచ్చు. అంతే కాదు. ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ SAMSUNG గెలాక్సీ F62, OPPO A53s 5G మరియు అత్యధిక వసూళ్లు చేసిన Google Pixel 4a ఫోన్‌లపై తగ్గింపును మరింత పొడిగిస్తోంది. అలాగే, ఈ ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి వచ్చే అమ్మకాలలో కొన్ని మాత్రమే. ఇవి కాక, అనేక ఇతర బ్రాండ్‌లపై కూడా మరిన్ని డిస్కౌంట్‌లను అందిస్తోంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డిస్కౌంట్ ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డిస్కౌంట్ ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ మొబైల్ ఫోన్ మోడల్స్ మరియు యాక్సెసరీస్, స్మార్ట్ వాచ్‌లు, టాబ్లెట్‌లు మరియు ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు స్మార్ట్ టీవీలతో సహా గృహోపకరణాలపై డిస్కౌంట్లను సూచించే మైక్రోసైట్‌ను అమెజాన్ ప్రత్యేకంగా రూపొందించింది. అమెజాన్ యొక్క సేల్స్ లో అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ మరియు కిండ్ల్ పరికరాలను సంవత్సరంలో అతి తక్కువ ధరలకు అందిస్తుందని కూడా పేర్కొన్నారు. ఇంకా దేశంలో వాయిస్ అసిస్టెంట్ యొక్క యూజర్ బేస్ విస్తరించేందుకు అలెక్సా స్మార్ట్ హోమ్ కాంబో ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon, Flipkart Festival Sale Shopping is Good or Bad

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X