Amazon, Flipkartలో డిస్కౌంట్లో లభిస్తున్న టాప్‌ఎండ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే !
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రిపబ్లిక్ డే సేల్ సందడి మొదలైన విషయం అందరికీ తెలిసిందే.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రిపబ్లిక్ డే సేల్ సందడి మొదలైన విషయం అందరికీ తెలిసిందే. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ పేరుతో ఈ రెండు దిగ్గజాలు మూడు నాలుగు రోజుల పాటు స్పెషల్ సేల్ నిర్వహిస్తున్నాయి. ఈ సేల్ లో భాగంగా టాప్ ఎండ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ ధరలో టాప్‌ఎండ్ స్మార్ట్‌ఫోన్లను దక్కించుకునే అవకాశాన్ని ఈ కామర్స్ దిగ్గజాలు వినియోగదారులకు కల్పిస్తున్నాయి. కాగా ఈ స్పెషల్ సేల్ ఈ రోజు వరకే అందుబాటులో ఉండనుంది. ఆఫర్లు ఇవే...

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ 64జీబీ
గత ఏడాది నవంబరులో లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్ రూ.84,999లకే లభిస్తోంది. కాగా దీని అసలు ధర రూ. 89వేలు. అలాగే 18 వేల రూపాయల దాకా ఎక్సేంజ్ ఆఫర్.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ 32జీబీ
ఈ ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రూ .35,990 కు లభ్యం. అసలు ధర రూ .41,900. అలాగే రూ.18వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్

హానర్ 8 ప్రో 128జీబీ/ 6జీబీర్యామ్
ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందిస్తున్న17శాతం కాగా డిస్కౌంట్‌తో ప్రస్తుతం ఇది రూ.24,999కి లభ్యమవుతోంది. కాగా దీని అసలు ధర రూ.29,999.

ఎల్‌జీ జీ 6
బెజెల్ లెస్ డిస్‌ప్లే, డ్యుయల్ రియర్ కెమెరాలతో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఏకంగా 45 శాతం తగ్గింపు ధరలో ఆఫర్ చేస్తోంది. రూ.55,500కు లాంచ్ కాగా ప్రస్తుతం ఇది కేవలం రూ. 29,990 లకే లభ్యంకానుంది.

షియోమి ఎంఐ మిక్స్ 2:
షియోమి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ ఎంఐ మిక్స్ 2 ఫ్లిప్‌కార్ట్ 29,990లకే అందిస్తోంది. గరిష్టంగా 21వేల రూపాయల వరకు ఎక్సేంజ్ ఆఫర్.

గూగుల్ పిక్సెల్, లెనోవా స్మార్ట్‌ఫోన్లపై..
గూగుల్ పిక్సెల్, లెనోవా స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపును అందుబాటులో తెచ్చాయి. వీటితోపాటు ఇతర స్మార్ట్‌ఫోన్లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








