Home
News

షాకింగ్: అమెజాన్‌లో PS5 ఆర్డర్ చేస్తే పీఎస్3 వచ్చింది.. రిఫండ్ కోసం కస్టమర్ కన్నీళ్లు..

Amazon PS5: ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పెద్దగా పాపులర్ కాని ఈ-కామర్ సంస్థలే కాదు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి కంపెనీలు కూడా కస్టమర్లను నిండా ముంచేస్తున్నాయి. తాజాగా ఓ అమెజాన్‌ కస్టమర్‌కు ఊహించని షాక్ తగిలింది. వీడియో గేమ్ కన్సోల్ ప్లే స్టేషన్ 5 (PS5) స్లిమ్ ఆర్డర్ చేస్తే.. చిరిగిపోయిన డబ్బాలో పాడైపోయిన ప్లేస్టేషన్ 3 (PS3) వచ్చింది. అంతేకాదు, ఇప్పుడు రిఫండ్ కోసం కూడా చుక్కలు చూపిస్తోంది అమెజాన్.

* అసలేం జరిగిందంటే..

జనవరి 5న ఓ కస్టమర్ అమెజాన్‌లో ప్లేస్టేషన్ 5 స్లిమ్ (PS5 Slim) ఆర్డర్ చేశారు. జనవరి 7న డెలివరీ వచ్చింది. పార్సిల్ చూడగానే కస్టమర్‌కి అనుమానం వచ్చింది. బాక్స్ చిరిగిపోయి ఉండటమే దీనికి కారణం. కొత్త ప్రొడక్ట్ కదా అని అనుమానంతో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెక్ చేస్తే 2023, నవంబర్ అని ఉంది.

Amazon Fraud  Customer Orders PS5  Receives PS3 Instead  Reddit Reacts

దీంతో కస్టమర్‌కి మరింత డౌట్ వచ్చింది. వెంటనే అమెజాన్ సపోర్ట్ టీమ్‌కు ఫోన్ చేసి రిటర్న్ పెట్టారు. జనవరి 15న పిక్ అప్ కోసం డెలివరీ బాయ్ వస్తానని చెప్పారు. జనవరి 15న డెలివరీ బాయ్ పార్సిల్ తీసుకువెళ్లడానికి వచ్చాడు. కస్టమర్ ముందే బాక్స్ ఓపెన్ చేశాడు.

అంతే, లోపల PS5కి బదులు పాత చింతకాయ పచ్చడిలాంటి PS3 కనిపించింది. ప్రొడక్ట్ మారిపోవడంతో డెలివరీ బాయ్ రిటర్న్ తీసుకోకుండా వెళ్లిపోయాడు. తప్పు ప్రొడక్ట్, రిటర్న్ చేసుకోవడానికి వీల్లేదు అనే రూల్ తేల్చుకొని కస్టమర్ షాక్ అయ్యాడు. లబోదిబోమంటూ ఏం చేయాలో పాలుపోక కంగారు పడ్డాడు.

* అమెజాన్ సపోర్ట్‌తో తిప్పలు..

మళ్లీ అమెజాన్ కస్టమర్ కేర్‌కు ఫోన్లు, మెయిల్స్ మీద మెయిల్స్.. పార్సిల్ వచ్చినప్పటి ఫొటోలు, ఓపెన్ చేసినప్పటి ఫొటోలు అన్నీ పంపించాడు. చాలా రోజులు గగ్గోలు పెట్టిన తరువాత, ఎలాగోలా రెండోసారి పిక్ అప్ చేయడానికి అమెజాన్ ఒప్పుకుంది. ఈసారి రిటర్న్ పూర్తయింది. ప్రొడక్ట్ వెనక్కి వెళ్లిపోయింది. కానీ రిఫండ్ మాత్రం రాలేదు.

"మేం పంపింది కరెక్ట్ ప్రొడక్టే, రిఫండ్ ఇవ్వలేం" అని అమెజాన్ తెగేసి చెప్పింది. కస్టమర్ షాకయ్యాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఫొటోలు చూపించినా అమెజాన్ వినిపించుకోలేదు. రిఫండ్ గ్యారెంటీ ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. బాక్స్ రాగానే ఓపెన్ చేయాల్సింది పోయి.. డెలివరీ బాయ్ కోసం వెయిట్ చేసి తప్పు చేశానని కస్టమర్ ఇప్పుడు కుమిలిపోతున్నాడు.

* నెటిజన్లు ఆగ్రహం

"బాక్స్ నలిగిపోయి, చిరిగిపోయి ఉండటం చూసి కంగారు పడ్డాను. డెలివరీ అతను ఓపెన్ చేస్తాడని వెయిట్ చేశాను. అదే నా కొంప ముంచింది" అని వాపోయాడు ఆ కస్టమర్. ఈ ఘటనతో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లంతా టెన్షన్ పడుతున్నారు. అమెజాన్ రిటర్న్ పాలసీలు, రిఫండ్ ప్రాసెస్ మీద చాలా మందికి నమ్మకం పోతోంది.

ప్రస్తుతానికి అమెజాన్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. కస్టమర్ మాత్రం రిఫండ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే, ఆన్‌లైన్‌లో ఏది కొన్నా పార్సిల్ రాగానే వెంటనే ఓపెన్ చేసి చూసుకోవాలి. అనుమానం వస్తే వీడియో తీయడం మర్చిపోవద్దు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon customer ordered a PS5, received a PS3, and faces refund issues. Despite photo proof, Amazon denies fault, causing customer frustration with return policies and unresolved issues.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X