అమెజాన్ నకిలీ గిఫ్ట్ కార్డ్‌ల ఫేక్ కాల్ సెంటర్‌ను చేదించిన పోలీసులు!! ఎక్కడనో తెలుసా?

|

ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో టెక్నాలజీ అధికంగా పెరగడంతో మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు దొర్జన్యంగా ప్రజల వద్ద నుండి డబ్బులను దోచుకొంటూ ఉంటే ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి తెలివిగా ప్రజల వద్ద నుండి దోచుకుంటున్నారు. అయితే కొంత మంది మరింత ఒకఅడుగు ముందుకు వేసి ప్రజలను దోచుకోవడానికి ఏకంగా కాల్ సెంటర్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి వంటి కాల్ సెంటర్ల ఏర్పాటు ఎక్కడో కాదు మన దేశ రాజధాని ఢిల్లీలో ఉండడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. సరైన సమాచారం అందుకొని పోలీసులు ఘటన స్థలానికి వెళ్ళి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్ సెంటర్ వారు ఎవరిని ఎవరి పేరుతో మోసగించడానికి ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గిఫ్ట్ కార్డ్‌ రీడీమ్

గిఫ్ట్ కార్డ్‌లను రీడీమ్ చేస్తామనే సాకుతో ప్రజలను మోసగిస్తున్న నకిలీ కాల్ సెంటర్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఆదర్శ్, నవీన్, ప్రదీప్, ఎండీ సైఫుద్దీన్, నితిన్, ప్రవీణ్ చౌహాన్, రాహుల్, బ్రిజేష్, సాహిబా ఖాతున్ అలియాస్ ట్వింకిల్, అభా, మోనిక, మోహిత్ వర్మ పేరు గల వారు ఉన్నట్లు గుర్తించారు.

కాల్ సెంటర్ మీద రైడ్

ఇగ్నో రోడ్, నెబ్ సరాయ్‌లో అమెరికా పౌరులను మోసగించడానికి ఈ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి రాత్రి సమయంలో ఇగ్నో రోడ్‌లోని బల్హరా హాస్పిటల్ సమీపంలో ఉన్న కాల్ సెంటర్ మీద రైడ్ చేసి అందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గుర్తు తెలియని వక్తి ఇన్‌ఫార్మ ఇవ్వడంతో దాడి నిర్వహించబడింది అని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం కాల్ సెంటర్ లో కంప్యూటర్లు మరియు వాటి ఉపకరణాల సెటప్‌ను అమర్చినట్లు కనుగొనబడింది. చాలా మంది వ్యక్తులు ఫోన్ కాల్‌లను స్వీకరిస్తున్నారు. వీరు అమెజాన్ ప్రతినిధిగా నటిస్తూ బాధితులతో కమ్యూనికేట్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు అని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఫేక్ కాల్ సెంటర్‌
 

ఫేక్ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్న నిందితుల వద్ద నుంచి తొమ్మిది డెస్క్‌టాప్ సిస్టమ్‌లతో పాటు ఇంటర్నెట్ రూటర్, టిపి-లింక్ మోడెమ్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "కంప్యూటర్ యాప్స్- టీమ్ వ్యూయర్, జోహో అసిస్ట్‌ని ఉపయోగించడం ద్వారా కాల్ సెంటర్‌ నిర్వాహకులు బాధితులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అమెజాన్‌లో రిడీమ్ చేసిన గిఫ్ట్ కార్డ్‌ల ద్వారా వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు అని పోలీసులు చెప్పారు. వీరి మీద పోలీసులు IPC సెక్షన్ 419/420/120B/34 కింద కేసులు నమోదు చేశారు.

క్రిప్టోకరెన్సీ

పుణె పోలీసులు గత నెలలో కూడా ఇలాంటి కేసుని ఛేదించారు. ఒక మాజీ IPS ఆఫీసర్ యొక్క అకౌంట్ హ్యాక్ అయినట్లు ఫిర్యాదు చేసారు. ఇందులో భాగంగా బహుళ-కోట్ల క్రిప్టోకరెన్సీ మోసానికి సంబంధించి సైబర్ నిపుణుడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మార్చి నెలలో మాజీ IPS ఆఫీసర్ యొక్క డిజిటల్ వాలెట్ల నుండి కోట్ల రూపాయల విలువైన డబ్బును మోసపూరితంగా వారి అకౌంటులకు బదిలీ చేయడంతో సైబర్ నేరగాళ్ళను మోసం చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

డిజిటల్ కరెన్సీ

డిజిటల్ కరెన్సీ టెక్నాలజీ సమస్య కావడంతో 2018లో నమోదైన రెండు క్రిప్టోకరెన్సీ కేసులను దర్యాప్తు చేసేందుకు ఇండియన్ పోలీస్ సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న పాటిల్ మరియు ఘోడేలను పూణే పోలీసులు రంగంలోకి దించారు. దర్యాప్తు సమయంలో పాటిల్ తన అకౌంటులోని కొన్ని క్రిప్టోకరెన్సీలను బదిలీ చేసారు. ఘోడే లెక్కలను తారుమారు చేయడం ద్వారా పోలీసులకు అకౌంటుల స్క్రీన్‌షాట్‌లను అందించారని పోలీసులు ఆరోపించారు.

Best Mobiles in India

English summary
Amazon Gift Cards Fake Call Center Closed by Police!! Do You Know Where?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X