అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025 తేదీలు వచ్చేశాయ్.. ఈ కార్డులపై 10 శాతం డిస్కౌంట్..!
Amazon Great Freedom Festival 2025 : అమెజాన్ ఇటీవల ప్రైమ్ డే సేల్ నిర్వహించింది. తొలిసారిగా మూడు రోజులపాటు నిర్వహించింది. కేవలం ప్రైమ్ మెంబర్లకు మాత్రమే సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సేల్ ను వచ్చే నెలలో ప్రారంభం కానుందని తెలిపింది. ప్రైమ్ మెంబర్లు ముందుగానే సేల్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. దీంతోపాటు ఈ సేల్ డీల్స్‌తోపాటు బ్యాంకు ఆఫర్ల వివరాలను వెల్లడించింది.
అమెజాన్ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 (Amazon Sale 2025) ఆగస్టు 1 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు 12 గంటల ముందుగానే సేల్ లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా SBI బ్యాంకు కార్డులపై కొనుగోలు లేదా EMI లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు.

ఈ ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ సహా ఇతర గృహోపకరణాలను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో భాగంగా ట్రెండింగ్ డీల్స్, 8PM డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ లో భాగంగా అనేక ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చు.
సేల్ ఎన్నిరోజులపాటు నిర్వహించనుంది :
ప్రస్తుతానికి అమెజాన్ సేల్ తేదీలు సహా బ్యాంకు ఆఫర్ల వివరాలను మాత్రమే విడుదల అయ్యాయి. త్వరలో సేల్ లో భాగంగా అందించే డీల్స్ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు సెగ్మెంట్లు, కేటగిరీల వారీగా కూడా డీల్స్ వివరాలు వెల్లడి కానున్నాయి. అయితే ఈ సేల్ ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తుందనే వివరాలను అమెజాన్ వెల్లడించలేదు.

అమెజాన్ లో పోటీలు :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా రూ.94900 విలువైన మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్ ను గెలుచుకొనేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం అమెజాన్ పేజీలోకి లాగిన్ కావాలి. హోం పేజీలో కనిపించిన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ బ్యానర్ పైన క్లిక్ చేయాలి.
అనంతరం Spin & Win మ్యాక్‌బుక్ ఎయిర్ అండ్ More ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కనిపించిన పాయింటర్‌ను స్పిన్ చేయాల్సి ఉంటుంది. విజేతలు రూ.94900 విలువ చేసే మ్యాక్‌బుక్ ఎయిర్ మరియు రూ.400 అమెజాన్ పే బ్యాలెన్స్ ను పొందవచ్చు. అనంతరం అక్కడో ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఎలా పొందాలి :
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం నెలకు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడు నెలల కోసం రూ.599 చెల్లించాల్సి ఉంటుంది. అదే సంవత్సరం ప్లాన్ కోసం రూ.1499 చెల్లించాలి. అయితే అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ సంవత్సరం ప్లా్న్ ధర రూ.399 గా ఉంది.


Click it and Unblock the Notifications








