Home
News

Amazon Great Freedom Festival Sale:కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్

కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరు తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయడం కోసం ఆన్ లైన్ షాపింగ్ పద్దతులను అనుసరిస్తున్నారు. అమెజాన్ ఇ-కామర్స్ సంస్థ తన ప్లాట్‌ఫామ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సేల్ లను ప్రారంబిస్తున్నది. ఈ నెల ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగా మరొక సేల్ ను అధికారికంగా ప్రకటించింది. 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్' పేరుతో వచ్చే ఈ సేల్ ఆగస్టు 5 న అంటే రేపు ప్రారంభమై ఆగస్టు 9 అర్ధరాత్రి వరకు జరగనున్నాయి.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్

ఐదు రోజులపాటు జరిగే ఈ అమ్మకం సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌ల కొనుగోలు మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. వీటితో పాటుగా ఫ్యాషన్ & బ్యూటీ ఎసెన్షియల్స్, కిచెన్‌ & కిరాణా మరియు డైలీ ఎసెన్షియల్స్ వంటి వివిధ కేటగిరీల ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపు ఆఫర్‌లు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో షాపింగ్ చేసే కస్టమర్‌లు SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద 10 % వరకు తక్షణ డిస్కౌంట్‌ను ఆదా చేయవచ్చు. అదనంగా వీరికి నో-కాస్ట్ EMI కూడా లభిస్తుంది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ బ్యాంక్ ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ బ్యాంక్ ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అమ్మకం సమయంలో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు రాయితీ పొందుతారు. అదనంగా ఇ-టైలర్ నో-కాస్ట్ EMI ఆప్షన్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్లు మరియు బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తుంది. ముఖ్యంగా SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద 10% వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేసిన వారికి తమ యొక్క కొనుగోలు మీద అధిక మొత్తంలో క్యాష్ బ్యాక్ లు లభిస్తాయి.

టెక్నో పోవా 2 అమెజాన్ స్పెషల్ సేల్

టెక్నో పోవా 2 అమెజాన్ స్పెషల్ సేల్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గొప్ప అవకాశం లభిస్తున్నది. ముఖ్యంగా ఇటీవల ఇండియాలో లాంచ్ అయిన 7000mAh బ్యాటరీ టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ మొదటి సారి అమ్మకానికి రానున్నది. రూ.10,499 ప్రారంభ ధర వద్ద లభించే ఈ ఫోన్ కొనుగోలు మీద అదనంగా రూ.500 తగ్గింపు లభించడంతో పాటుగా డిస్కౌంట్ కూపన్స్ కూడా లభిస్తాయి.

కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్స్

కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్స్

ఇటీవల లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు రెడ్‌మి నోట్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా మొదటి సారి ఈ సేల్ లో కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో రెడ్‌మి నోట్10T 5G రూ.14,499 ధర వద్ద లభిస్తున్నది. అలాగే సాంసంగ్ గాలక్సీ M21 2021 ఎడిషన్ రూ.11,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే IQOO 7 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.31,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇటీవల లాంచ్ అయిన వన్ ప్లస్ నార్డ్ 2 5G కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.

పవర్ బ్యాంకులపై డిస్కౌంట్ ఆఫర్స్

పవర్ బ్యాంకులపై డిస్కౌంట్ ఆఫర్స్

అమెజాన్ యొక్క కొత్త సేల్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీదనే కాకుండా పవర్ బ్యాంకుల మీద కూడా 40% వరకు తగ్గింపును అందిస్తున్నాయి. 20000mAh సామర్ధ్యం గల Mi పవర్ బ్యాంక్ 3i ను ప్రస్తుత అమ్మకంలో కేవలం రూ.1499 తగ్గింపు ధర వద్దనే పొందవచ్చు. అలాగే ఈ అమ్మకంలో వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై కూడా అమెజాన్ డిస్కౌంట్ ధరల వద్ద అందిస్తున్నది.

టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత HiOS లో రన్ అవుతుంది. ఇది 6.95-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,460 పిక్సెల్స్ రేషియో, 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 386 PP పిక్సెల్ డెన్సిటీ, 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 180HZ టచ్ శాంప్లింగ్ రేట్‌ని కలిగి ఉంది. అలాగే హుడ్ కింద ఇది మీడియాటెక్ హీలియో G85 SoC మరియు మాలి G52 GPU, 6GB వరకు ర్యామ్, మరియు 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కంపెనీ అంతర్నిర్మిత 'హైపర్‌ఇంగైన్ గేమ్ టెక్నాలజీ'ని కలిగి ఉంది. ఇది టెక్నో పోవా 2 "హై-ఎండ్ గ్రాఫిక్ క్రంచింగ్‌ను ఇస్తుందని పేర్కొంది, ఇది భారీ గేమింగ్‌కు కూడా సరిపోతుంది." ఆప్టిక్స్ విషయానికి వస్తే టెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో AI క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.79 ఎపర్చర్ లెన్స్ & AI ప్రైమరీ సెన్సార్‌తో 48-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఈ సెటప్‌లో క్వాడ్-ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో f/2.0 ఎపర్చరు లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరా సెన్సార్ ను కలిగి ఉంది. ఇది పంచ్-హోల్ కటౌట్‌లో ఉండి 2K వీడియో రికార్డింగ్ మరియు 2x జూమ్ ఫీచర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Great Freedom Festival Sale 2021: Discount Offers on New Launch Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X