Amazon Great Freedom Festival Sale: స్మార్ట్‌వాచ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ఆగస్టు నెలలో రాబోయే స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని అమెజాన్ లో ఇప్పుడు 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్' పేరుతో సేల్స్ ను ప్రకటించింది. ఈ రోజు మొదలైన ఈ సేల్ ఆగస్టు 9 వరకు ఐదు రోజులపాటు నిర్వహించనున్నది. ఈ అమ్మకం సమయంలో స్మార్ట్‌వాచ్ లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉంటే కనుక దీని కన్నా మంచి తరుణం మరొకటి లేదు అని ఖచ్చితంగా తెలపవచ్చు. ఇ-రిటైల్ దిగ్గజం SBI క్రెడిట్ కార్డులు మరియు క్రెడిట్ కార్డ్ ఆధారిత EMI లావాదేవీలను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై అదనంగా 10% తక్షణ తగ్గింపును కూడా అందిస్తుంది.

అమెజాన్ లో ఇప్పుడు అందుబాటులో ఉన్న 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్' లో అని రకాల స్మార్ట్‌వాచ్ లు మరియు స్మార్ట్‌బ్యాండ్ లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి 40% వరకు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా బ్యాంక్ ఆఫర్లు మరియు నో-కాస్ట్ EMI ఆఫర్లు కూడా ఉన్నాయి.

నాయిస్ కలర్ ఫిట్ స్మార్ట్ వాచ్ సేల్స్ ఆఫర్స్
నాయిస్ కలర్ ఫిట్ స్మార్ట్ వాచ్ సేల్స్ ఆఫర్స్
** అలెక్సా బిల్ట్-ఇన్, 24*7 స్పోర్ట్స్ 2 మానిటరింగ్, 1.55 "HD ట్రూ వ్యూ డిస్‌ప్లే, ఒత్తిడి, స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్ గల నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 3 అసిస్ట్ స్మార్ట్ వాచ్ ను రూ.3,999 లాంచ్ ఆఫర్ వద్ద కొనుగోలు చేయవచ్చు.
** నాయిస్ కలర్ ఫిట్ పల్స్ స్పో 2 స్మార్ట్ వాచ్ ను రూ.2,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 1.4 "ఫుల్ టచ్ HD డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీ లైఫ్ హార్ట్ రేట్, స్లీప్ మానిటరింగ్ & IP68 వాటర్‌ప్రూఫ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీనితో పాటుగా నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా స్మార్ట్ వాచ్ ను రూ.4,499 తగ్గింపు ధర వద్ద అమెజాన్ అందిస్తున్నది.

రియల్‌మి స్మార్ట్ వాచ్ లపై డిస్కౌంట్ ఆఫర్స్
1.75 "HD సూపర్ బ్రైట్ టచ్‌స్క్రీన్, డ్యూయల్-శాటిలైట్ GPS, 14-రోజుల బ్యాటరీ, SpO2 & హార్ట్ రేట్ మానిటరింగ్, IP68 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ గల రియల్‌మి స్మార్ట్ వాచ్ 2 ప్రో ను రూ.999 తగ్గింపు పొందిన తరువాత రూ.5000 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అలాగే 1.3 "TFT-LCD టచ్‌స్క్రీన్, 15 రోజుల బ్యాటరీ లైఫ్, SpO2 & హార్ట్ రేట్ మానిటరింగ్, IP68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్ తో లభించే రియల్‌మి స్మార్ట్ వాచ్S కొనుగోలు మీద రూ.3000 తగ్గింపుతో ప్రస్తుత అమెజాన్ అమ్మకంలో కేవలం రూ.4999 ధర వద్ద పొందవచ్చు.

Mi స్మార్ట్ వాచ్ లపై డిస్కౌంట్ ఆఫర్స్
Mi వాచ్ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ బ్లాక్ కలర్ లో రూ.8,100 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఇది 1.39 "AMOLED డిస్‌ప్లే, SpO2, GPS మరియు స్లీప్ మానిటర్, అలెక్సా బిల్ట్ -ఇన్, 117 స్పోర్ట్స్ మోడ్, వ్యక్తిగతీకరించిన వాచ్ పేస్, 2 వారాల బ్యాటరీ లైఫ్, సంగీతం మరియు కెమెరా నియంత్రణ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

ఇతర స్మార్ట్ వాచ్ లపై డిస్కౌంట్ ఆఫర్స్
పైన తెలిపిన స్మార్ట్ వాచ్ లతో పాటుగా ఇతర బ్రాండ్ల స్మార్ట్ వాచ్ ల కొనుగోలు మీద కూడా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. వీటిలో ఆపిల్ వాచ్ SE ను దాదాపు రూ.3000 తగ్గింపు పొందిన తరువాత రూ.24,650 ధర వద్ద పొందవచ్చు. అలాగే ఒప్పో స్మార్ట్ బ్యాండ్ ను రూ.1,999 ధర వద్ద, వన్‌ప్లస్ స్మార్ట్ బ్యాండ్ ను రూ.2,199 ధర వద్ద, ఫైర్-బోల్ట్ 360 ను రూ.3,499 వద్ద, అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రో NYSE లిస్టెడ్ స్మార్ట్ వాచ్ ను రూ.4,699 ధర వద్ద, అమాజ్‌ఫిట్ GTS 2 స్మార్ట్ వాచ్ ను రూ.11,250 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇవి 13 వ్యాయామ రీతులు, బ్లడ్ ఆక్సిజన్ సంతృప్తత (SpO2), హృదయ స్పందన రేటు & స్లీప్ ట్రాకింగ్, 5ATM+వాటర్ & డస్ట్ రెసిస్టెంట్ Android & iOS అనుకూలమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








