Amazon sale రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్లపై మంచి డిస్కౌంట్లు.. లిస్ట్..!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం జరుగుతోంది. ఆగస్టు 3 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రైమ్ మెంబర్లకు ప్రారంభం అయింది. ఆగస్టు 4 నుంచి అందరికీ ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు 8 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, టీవీలు, హెడ్‌ఫోన్లు సహా అనేక ఉత్పత్తులపై ఉత్తమ ఆఫర్లు ఉన్నాయి.
ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం. ఈ సేల్‌లో భాగంగా వివిధ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై మంచి డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.20000 లోపల కొన్ని ప్రముఖ బ్రాండ్ల ఫోన్లపై ఈ సేల్‌లో భాగంగా మంచి డిస్కౌంట్లు పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G : ఈ స్మార్ట్‌ఫోన్ 2022 ఏప్రిల్‌లో లాంచ్ అయింది. విడుదల సమయంలో రూ.19,999 ధరకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా రూ.17,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 5G SoC పై పనిచేస్తుంది.
ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 64MP ప్రధాన కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ బ్లూ టైడ్, బ్లాక్ డస్క్ రంగుల్లో లభిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1000 తగ్గింపును పొందుతారు.
శాంసంగ్ గెలాక్సీ M34 5G : Exynos 1280 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. 6.5 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా, 8MP సెకండరీ కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. మందువైపు 13MP కెమెరాలను కలిగి ఉంటుంది. వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది. ఈ సేల్‌లో భాగంగా 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.18999కు అందుబాటులోకి వస్తుంది.
ఒప్పో A78 5G : స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక వైపు 50MP కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్OS 13పై పనిచేస్తుంది. సేల్‌లో భాగంగా ఈ ఫోన్ ధర రూ.18999గా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు.
రెడ్‌మీ నోట్ 11T 5G : ఈ రెడ్‌మీ ఫోన్ 2021 నవంబర్‌లో విడుదల అయింది. ఈ ఫోన్ 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.19,999 అందుబాటులో ఉంది. అయితే ఈ సేల్‌లో భాగంగా రూ.18499కే కొనుగోలు చేయవచ్చు.
SBI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు. 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల పుల్ HD+తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC పై పనిచేస్తుంది. 50MP ప్రధాన కెమెరా, 8MP ఆల్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది.
Mi 10i 5G : ఈ స్మార్ట్ ఫోన్ జనవరి 2021లో లాంచ్ అయింది. ప్రస్తుతం 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.18999 గా ఉంది. 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ రూ.20999కు ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ 6.67 అంగుళాల పుల్ HD వాటర్‌డ్రాప్ స్టైల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz అడాప్టివ్ రీఫ్రెష రేట్‌తో వస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 750G SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 108MP శాంసంగ్ HM2, 8MP ఆల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








