అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024లో గరిష్ఠంగా 80 శాతం డిస్కౌంట్..సేల్ ఎప్పుడు ప్రారంభం కానుంది?
భారత్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 (Amazon Great Freedom festival sale 2024) పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్ ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందు నుంచే సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంది. SBI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడం ద్వారా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. అయితే ఎప్పటి వరకు ఈ సేల్ కొనసాగుతుందనే సమాచారం వెల్లడి కాలేదు.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులపై గణనీయమైన డిస్కౌంట్‌లు పొందవచ్చని తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతోపాటు ఇతర గృహోపకరణాలపైనా తగ్గింపును పొందవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు సహా :
ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ S24, ఐకూ 12, రెడ్‌మి నోట్ 13 ప్రో 5G, వన్‌ప్లస్ ఓపెన్, వన్‌ప్లస్ 12, రియల్‌మి నార్జో 70 ప్రో, ఐకూ నియో 9 ప్రో, రెడ్‌మి 13 5G, శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌లు సహా మరిన్ని బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరలో కొనుగోలు చేయవచ్చు.
విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ పైనా డిస్కౌంట్‌లు :
ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా విమాన టికెట్ల బుకింగ్ పైన డిస్కౌంట్లను అందించనుంది. విమాన టికెట్లపై గరిష్ఠంగా 20 శాతం డిస్కౌంట్, హోటల్ బుకింగ్‌లపై 40 శాతం డిస్కౌంట్, దీంతోపాటు ట్రెయిన్ టికెట్లపై 100 శాతం రిఫండ్‌ను పొందవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడర్ ఫెస్టివల్ సేల్ డిస్కౌంట్లు :
ఈ అమెజాన్ ప్రత్యేక సేల్‌లో భాగంగా గరిష్ఠంగా 40 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందవచ్చు. మరియు స్మార్ట్‌ఫోన్‌ల ప్రారంభ ధర రూ.6799 గా ఉంది. దీంతోపాటు ట్యాబ్లెట్‌లపైన 6 శాతం వరకు, హెడ్‌ఫోన్‌ల పైన 75 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది. అదే స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా 80 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని వెల్లడించింది.
ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలపై 65 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందవచ్చు. అదే ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తులపై గరిష్ఠంగా 60 శాతం తగ్గింపును పొందవచ్చని తెలుస్తోంది. అమెజాన్ ఫైర్ టీవీ మరియు అలెక్సా ఉత్పత్తులపై 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








