Home
News

అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2024 ప్రారంభం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ధరలు..!

అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2024 (Amazon Great Freedom Festival Sale 2024) ప్రారంభం అయింది. అయితే ప్రస్తుతం ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశం ఉండగా.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరూ ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌ ఆగస్టు 11 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, అమెజాన్‌ డివైస్‌ సహా ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 5G, శాంసంగ్‌ గెలాక్సీ S21 FE 5G, ఐఫోన్‌ 13 హ్యాండ్‌సెట్‌లతోపాటు ఇతర ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు అనేక ఉత్పత్తులను కూడా డిస్కౌంట్‌ ధరలకు సొంతం చేసుకోవచ్చు.

Amazon Great Freedom Festival sale 2024 is live for prime members

ఐఫోన్‌ 13 : ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 13 హ్యాండ్‌సెట్‌ను బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.47,799 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్‌ : ఈ స్మార్ట్‌ఫోన్‌ సాధారణ ధర రూ.19,999 ఉండగా ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లు, కూపన్‌ కోడ్‌ ద్వారా రూ.16,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫో్‌ 50MP సోనీ LTE-600 ప్రైమరీ కెమెరా, 80W సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీపైన పనిచేస్తుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 5G : అమెజాన్ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్‌లతో కలిపి ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.27,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీపైన పనిచేస్తుంది. దీంతోపాటు స్నాప్‌ డ్రాగన్‌ 7+ జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ AI ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది.

ఐకూ Z9 లైట్‌ 5G : ఈ అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌ ను రూ.10,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.9999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరాలను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 5G SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ S21 FE 5G : అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2024 లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ హ్యాండ్‌సెట్‌ ను రూ.24,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌ సెట్ సాధారణ ధర రూ.28,999 గా ఉంది. స్నా్ప్‌ డ్రాగన్‌ 888 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Great Freedom Festival sale 2024 is live for prime members
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X