అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు..!!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 (Amazon Great Freedom Festival Sale 2024) పేరుతో ప్రత్యేక సేల్ ప్రకటన చేసింది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్ ఆగస్టు 6న ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్‌లు 12 గంటల ముందే ఈ సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అయితే ఈ సేల్ ఎన్ని రోజుల పాటు నిర్వహించనుందో అమెజాన్ వెల్లడించలేదు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్, ఇయర్‌బడ్స్ సహా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా SBI బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చని అమెజాన్ తెలిపింది. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, ఐకూ, పోకో, రియల్‌మి, టెక్నో సహా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్టంగా 40 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని అమెజాన్ తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ M15, గెలాక్సీ A35, వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12R, వన్‌ప్లస్ ఓపెన్, వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ నార్డ్ CE 4, వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
వీటితోపాటు ఐకూ Z9x, ఐకూ Z9, ఐకూ Z9 లైట్ 5G, ఐకూ 12 5G, ఐకూ Z7, రెడ్‌మి నోట్ 13 ప్రో+, రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి 12 5G, రెడ్‌మి 13 5G, షియోమీ 14 స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు.

ఈ సేల్‌లో భాగంగా పోకో M6 ప్రో, పోకో C65, ఒప్పో F27 ప్రో+, టెక్నో పోవా 6 ప్రో, టెక్నో స్పార్క్ 20 ప్రో, రియల్‌మి నార్జో 70 స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు అనేక స్మార్ట్‌ఫోన్‌ల డిస్కౌంట్ ధరలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 లో భాగంగా విమాన టికెట్ల బుకింగ్, హోటల్ రూంల బుకింగ్ పైనా డిస్కౌంట్లను అందించనుంది. విమాన టికెట్లపై గరిష్ఠంగా 20 శాతం డిస్కౌంట్, హోటల్ రూంల బుకింగ్‌లపై 40 శాతం డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు రైలు టికెట్ల రిజర్వేషన్‌పై 100 శాతం రిఫండ్‌ను పొందవచ్చని పేర్కొంది.
ఈ సేల్‌లో భాగంగా హెడ్‌ఫోన్స్ పైన 75 శాతం, స్మార్ట్ టీవీలపై 65 శాతం, అదే ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తులపై గరిష్ఠంగా 60 శాతం తగ్గింపును పొందవచ్చని తెలుస్తోంది. అమెజాన్ ఫైర్ టీవీ మరియు అలెక్సా ఉత్పత్తులపై 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications







