అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024.. రేపటి నుంచే ప్రారంభం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్..!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 (Amazon Great Freedom Festival Sale 2024) రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ ఆగస్టు 6 నుంచి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు 12 గంటలు ముందుగానే సేల్‌లో పాల్గొనేందుకు వీలుంటుంది. దీంతోపాటు SBI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అదే అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్ సహా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు సహా ఇతర ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, విడిభాగాలపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అనేక స్మార్ట్‌ఫోన్‌ల డిస్కౌంట్ ధరలను అమెజాన్ వెల్లడించింది. ఐఫోన్ 13 ను రూ.47,999 కే కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 12R సన్‌సెట్ డూన్ కలర్ వేరియంట్‌ను రూ.40,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే వన్‌ప్లస్ ఓపెన్, వన్‌ప్లస్ 12 మరియు వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ లను కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ఐకూ Z9 లైట్ మరియు ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఐకూ నియో 9 ప్రో హ్యాండ్‌సెట్‌ను బ్యాంకు, ఎక్స్చేంజీ ఆఫర్‌లతో రూ.31,999 కే కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి స్మార్ట్‌ఫోన్లలపై గరిష్ఠంగా రూ.4000 తగ్గింపును పొందవచ్చు.
దీంతోపాటు రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి 13 5G స్మార్ట్‌ఫోన్ ను కూపన్ క్యాష్‌బ్యాక్ ద్వారా రూ.12999 కే కొనుగోలు చేయవచ్చు. షియోమీ స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా రూ.10,000 వరకు తగ్గింపును పొందవచ్చు. మరియు 18 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M34, S21 SE, A55 మరియు గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును పొందవచ్చు. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా రూ.15,000 వరకు డిస్కౌంట్ ధరను పొందవచ్చని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S24 5G స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్‌లతో కలిపి రూ.74999 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా HMD, లావా, హానర్, మోటోరోలా సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ హ్యాండ్‌సెట్‌లను కూడా భారీ తగ్గింపు ధరలకు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్‌లు 12 గంటల ముందుగానే ఈ సేల్‌లో పాల్గొనవచ్చు.
ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 లో భాగంగా హెడ్‌ఫోన్స్ పైన 75 శాతం, స్మార్ట్ టీవీలపై 65 శాతం, అదే ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తులపై గరిష్ఠంగా 60 శాతం తగ్గింపును పొందవచ్చని తెలుస్తోంది. అమెజాన్ ఫైర్ టీవీ మరియు అలెక్సా ఉత్పత్తులపై 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. విమాన టికెట్ల బుకింగ్, హోటల్ రూంల బుకింగ్ పైనా డిస్కౌంట్లను అందించనుంది.


Click it and Unblock the Notifications








