Home
News

Amazon గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఉత్తమ ఆఫర్లు..!!

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రైమ్‌ మెంబర్లకు Great Freedom Festival sale ప్రారంభం కానుంది. మిగిలిన వారికి ఆగస్టు 4 నుంచి ఈ సేల్‌ ఆఫర్లు, డిసౌంట్లను పొందగలుగుతారు. ఈ సేల్‌ సమయంలో SBI క్రెడిట్‌ కార్డు లేదా EMI ద్వారా కొనుగోలు చేసిన వారికి 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని అమెజాన్‌ తెలిపింది.

ఈ అమెజాన్‌ సేల్‌ ఆగస్టు 8 వరకు జరగనుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు అమెజాన్‌ వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.

amazon Great Freedom Festival sale 2023

అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ M13 4GB ర్యామ్‌, 64GB అంతర్గత స్టోరేజీ, 6000mAh బ్యాటరీ కలిగిన ఫోన్‌ను రూ.9,649 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 5MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 8MP కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 SoC పై పనిచేస్తుంది.

ఒప్పో F23 5G : ఒప్పో F23 స్మార్ట్‌ఫోన్‌ సాధారణ ధర రూ.24999 కాగా.. ఈ సేల్‌లో భాగంగా రూ.22,499కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 6.72 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 8GB ర్యామ్‌, 256GB వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

మరియు 67W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత కలర్‌OS 13.1 పై పనిచేస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 695 5G SoCను కలిగి ఉంటుంది. 64MP సహా మూడు కెమెరాలను కలిగి ఉంటుంది.

OnePlus Nord 3 : వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో జులైలో విడుదల అయింది. ఈ సేల్‌లో భాగంగా 8GB ర్యామ్‌, 128 GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ రూ.32,999 కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్‌ డెమెన్సిటీ 9000SoC తో వస్తుంది.

ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్‌OS 13పై పనిచేస్తుంది. 6.74 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX890 కెమెరా, 8MP ఆల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. ముందువైపు 16MP కెమెరాతో వస్తుంది.

Realme Narzo 60 Pro : ఈ రియల్‌మీ ఫోన్‌ జులైలో లాంచ్‌ అయింది. 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.23,999గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 SoCతో వస్తుంది.

రియల్‌మీ నార్జో 60 ప్రో ఫోన్‌ సూపర్‌వాక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 100MP ప్రధాన కెమెరాతో పాటు 2MP కెమెరా ఉంటుంది. ముందువైపు 16MP కెమెరా ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ Z Fold 5 5G : ఈ ఫోన్‌ ఇటీవలే లాంచ్‌ అయింది. ఈ సేల్‌లో భాగంగా రూ. 1,55,999 అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 7.6 అంగుళాల డైనమిక్‌ ఆమోలెడ్‌ 2X ఇన్‌ఫినిటీ ఫ్లేక్స్‌ ప్యానల్‌ను కలిగి ఉంటుంది. 6.2 అంగుళాల పుల్‌ HD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2Xను కలిగి ఉంటుంది. ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoCతో వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon Great Freedom Festival sale deals available for prime members from today
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X