అమెజాన్ సేల్ లో రూ.10,000 ధర లోపు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్...
ప్రస్తుత రోజులలో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కరోనా కారణంగా ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ కోసం కావచ్చు లేదా ఇంటి వద్ద నుండి పనిచేసే వారికి గ్రూప్ వీడియో కన్ఫిరెన్స్ కాల్స్ చేయడానికి మరియు పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వినడానికి వీటి వినియోగం అధికమవుతున్నది. ప్రస్తుత సమయంలో స్మార్ట్‌ఫోన్‌లను కొనాలని చూస్తున్న వారు తక్కువ ధరలో లభించే వాటి కోసం వెతుకుతున్నారు.

కారణం ఇప్పటికే తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండడం కావచ్చు లేదా ఇతర ఫ్యామిలి కారణాల వలన బడ్జెట్ ధరలో లభించే ఫోన్ కోసం వెతుకుతుంటే కనుక ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పుడు తన ప్లాట్‌ఫామ్‌లో నిర్వహిస్తున్న 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్' అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. ఈ సేల్ లో రూ.10000 లోపు ధర వద్ద లభించే ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లు మరియు వాటి కొనుగోలు మీద లభించే ఆఫర్ల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ సేల్ లో Realme బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇండియాలో బడ్జెట్ ధరలో రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తుంటే కనుక రియల్‌మి నార్జో 20 ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డీ+ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేతో పాటుగా మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 48+8+2 మెగాపిక్సెల్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క 4GB ర్యామ్ +64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499 కాగా 4GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499. అలాగే రియల్‌మి C11 2021 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర రూ.6,699 కాగా, రియల్‌మి 30A వేరియంట్ ను రూ.8,999 ధర వద్ద పొందవచ్చు.

అమెజాన్ సేల్ లో రెడ్‌మి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు
షియోమి యొక్క సబ్-బ్రాండ్ రెడ్‌మి యొక్క స్మార్ట్‌ఫోన్‌లు కూడా ప్రస్తుత అమెజాన్ అమ్మకంలో బడ్జెట్ విభాగంలో లభిస్తున్నాయి. వీటిలో రెడ్‌మి 9 ప్రైమ్ యొక్క ధర రూ.9,999, రెడ్‌మి నోట్ 9 ధర రూ.11,999, రెడ్‌మి 9 పవర్ ధర రూ.10,499 కాగా రెడ్‌మి 9 రూ.8,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత అమ్మకంలో SBI కార్డులను వినియోగించి కొనుగోలు చేసిన వారికి అదనంగా 10% తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు స్నాప్ డ్రాగన్ SoC, 6.26 అంగుళాల డిస్ప్లే, 4,000mAh బ్యాటరీ మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి.

అమెజాన్ సేల్ లో శామ్సంగ్ గెలాక్సీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు
శామ్సంగ్ సంస్థ తక్కువ ధరలో అందిస్తున్న స్మార్ట్‌ఫోన్ల మీద అమెజాన్ ప్రస్తుత అమ్మకంలో గొప్ప ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రస్తుత ఆన్‌లైన్ అమ్మకాలలో వీటి మీద ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. వీటిలో శామ్సంగ్ గెలాక్సీ M02s ను రూ.10,499 ధర వద్ద శామ్సంగ్ గెలాక్సీ M02 ను రూ.7,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు.

అమెజాన్ సేల్ లో ఇతర బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అమ్మకంలో బడ్జెట్ ధర వద్ద కొనుగోలు చేయాలనుకునే ఇతర బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లలో టెక్నో మరియు నోకియా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వీటిలో నోకియా G20 ను రూ.9,899 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. టెక్నో స్పార్క్ 7Tను రూ.8,999 ధర వద్ద, టెక్నో స్పార్క్ 7 ప్రో రూ.10,999, టెక్నో స్పార్క్ 7 రూ.7,699 మరియు టెక్నో స్పార్క్ గో 2021 రూ.7,299 ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే వివో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లలో వివో Y20A ను రూ.11,499 మరియు వివో Y1s రూ.8,990 ధరల వద్ద పొందవచ్చు. అలాగే ఒప్పో బ్రాండ్ యొక్క బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒప్పో A15 ను రూ.10,490 మరియు ఒప్పో A11K ను రూ.8,990 ధరల వద్ద పొందవచ్చు. వీటి కొనుగోలు మీద SBI బ్యాంక్ ఆఫర్లు అదనంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








