అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ డేట్స్ వచ్చాయి!! డిస్కౌంట్ ఆఫర్స్ వేటి మీద ఎలా ఉన్నాయో తెలుసా?

|

2022 సంవత్సరంలో ఆగష్టు నెలలో నిర్వహించే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ యొక్క తేదీలు ప్రకటించబడ్డాయి. ఈ ప్రత్యేక ఆన్‌లైన్ సేల్స్ స్వాతంత్ర్య దినోత్సవంకు ముందుగా అంటే ఆగస్టు 6 నుండి ఆగస్టు 10 వరకు నిర్వహిస్తుంది. అమెజాన్ యొక్క గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలపై అధిక మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తున్నట్లు వాగ్దానం చేస్తుంది.

 

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌

ఒకవేళ మీరు గత నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఏవైనా వస్తువులను కొనుగోలు చేయడం మిస్ అయితే కనుక అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ సమయంలో టెక్నాలజీకి సంబందించిన కొన్ని ఉత్పత్తులను తగ్గింపు ధరలలో పొందేందుకు గొప్ప అవకాశంగా ఉంటుంది. ఈ సేల్ సమయంలో అమెజాన్ తన కార్డ్ హోల్డర్లకు 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి SBI కార్డ్‌లతో జతకట్టింది కావున SBI కార్డులను కలిగిఉన్న వారు డిస్కౌంట్లను పొందవచ్చు.

 

 

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2022 సేల్ ఎప్పుడు మొదలుకానున్నది?

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2022 సేల్ ఎప్పుడు మొదలుకానున్నది?

అమెజాన్ యొక్క గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ ఇండియాలో ఆగస్ట్ 6 నుండి ప్రారంభం కానున్నాయి మరియు ఆగస్టు 10 వరకు సేల్స్ జరగనున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ సేల్స్ సమయంలో విస్తృత శ్రేణి ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులను అందించడంతో పాటుగా మరికొన్ని రకాల బండిల్ చేయబడిన ఆఫర్‌లను కూడా అందిస్తుంది. మీరు 2022 రక్షా బంధన్ కోసం ఏవైనా బహుమతులను కొనాలని ప్లాన్ చేస్తుంటే కనుక ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై అద్భుతమైన తగ్గింపులను పొందేందుకు ఇది గొప్ప అవకాశం.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ నుండి ఏమి ఆశించాలి?
 

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ నుండి ఏమి ఆశించాలి?

అమెజాన్ తన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2022 సేల్‌లో వినియోగదారులను అందించబోయే డీల్‌లు మరియు ఆఫర్‌లను టీజ్ చేయడం ప్రారంభించింది. ఈ సేల్‌లో బ్లాక్ బస్టర్ డీల్స్, 8PM డీల్స్, బడ్జెట్ బజార్ వంటి విభాగాలలో అద్భుతమైన ఒప్పందాలను రోజులో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు మరియు వాటి ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందించనుంది. కొన్ని ఎంట్రీ లెవెల్ ఫోన్‌లను రూ.6,599 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయడం కోసం అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో కొత్త లాంచ్‌లను కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా OnePlus 10T మరియు iQOO 9T ఫోన్‌లపై గొప్ప ఆఫర్‌లు ఉన్నాయి. రెండు ఫోన్‌లు ఆగస్టు 3న భారతదేశంలో ప్రారంభమవుతాయి మరియు ఈ సేల్‌లో అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయించబడతాయి.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌

ఇండియాలో ఇటీవల లాంచ్ అయిన రెడ్మి K50i 5G ఫోన్ డిస్కౌంట్లు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో రెండవ సేల్‌ను ప్రారంభించనుంది. ఇది రూ.20,999 కంటే తక్కువ ధరకే పొందే అవకాశం ఉంటుంది. అలాగే సామ్ సంగ్ గెలాక్సీ M13, iQOO Neo 6 5G, టెక్నో కామన్ 19 Neo మరియు టెక్నో స్పార్క్ 9 కూడా ఈ సేల్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు ఈ పరికరాలపై గొప్ప తగ్గింపులను ఆశించవచ్చు. కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై నో-కాస్ట్ EMIని కూడా పొందగలరు.

హెడ్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

హెడ్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో ల్యాప్‌టాప్‌లపై రూ.40,000 వరకు, హెడ్‌ఫోన్‌లపై 75 శాతం వరకు మరియు టాబ్లెట్‌లపై 45 శాతం వరకు తగ్గింపులను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మీరు పండుగ సీజన్‌కు ముందు కొత్త గాడ్జెట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని లేదా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే కనుక అమెజాన్ యొక్క గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మీకు ఇష్టమైన ఎలక్ట్రానిక్స్‌ను తగ్గింపు ధరలలో పొందేందుకు మంచి సమయం కావచ్చు. ఈ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లు, గేమింగ్ యాక్సెసరీలు, TWS ఇయర్‌బడ్స్ మరియు కెమెరాలపై కూడా తగ్గింపులు ఉంటాయి. Boat Airdopes 121 Pro TWS ఇయర్‌బడ్‌లు మరియు GoPro Hero 10 బండిల్ వంటి కొత్తగా ప్రారంభించబడిన మరియు జనాదరణ పొందిన కొన్ని పరికరాలు కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

అమెజాన్ లో iQoo Neo 6

అమెజాన్ లో iQoo Neo 6

iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ.29,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.33,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఫన్ టచ్ OS 12లో రన్ అవుతుంది. ఇది 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.62-అంగుళాల ఫుల్-HD+ E4 AMOLED డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా ఆధారితమై గరిష్టంగా 12GB RAMతో జత చేయబడి వస్తుంది. అలాగే గేమింగ్ సమయంలో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇది లిక్విడ్ కూలింగ్ చాంబర్‌ను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Amazon Great Freedom Festival Sales Announced: Bank Deals and Discount Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X