అమెజాన్ దీపావళికి ఇస్తున్న బహుమతి....స్మార్ట్‌ఫోన్‌ల ఆఫర్లపై ఓ లుక్ వేయండి

|

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2019 సేల్స్ దీపావళి సీజన్ ను పురష్కరించుకొని 'సెలబ్రేషన్ స్పెషల్' తో మళ్ళి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. అమెజాన్ యొక్క దీపావళి సేల్స్ అక్టోబర్ 13 న ప్రారంభమై అక్టోబర్ 17 వరకు కొనసాగుతుంది. ఈ సేల్స్ ప్రైమ్ సభ్యుల కోసం అక్టోబర్ 12 న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. అమెజాన్ దసరా సేల్స్ మాదిరిగానే ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ కూడా డిస్కౌంట్లను అందిస్తుంది.

అమెజాన్ దీపావళికి ఇస్తున్న బహుమతి....స్మార్ట్‌ఫోన్‌ల ఆఫర్లు

 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, టీవీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై తగినంత ఆఫర్‌లను అందిస్తున్నది. అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ వినియోగదారులు ఈ సేల్స్ సమయంలో 10 శాతం తక్షణ తగ్గింపును పొందడానికి అర్హులు అవుతారు. ఎంచుకున్న మొబైల్‌లకు ఉచిత స్క్రీన్ రిప్లేసెమెంట్, నో-కాస్ట్ EMI లు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అమెజాన్ అందిస్తోంది.

అమెజాన్ దీపావళికి ఇస్తున్న బహుమతి....స్మార్ట్‌ఫోన్‌ల ఆఫర్లు

మొబైల్ ఫోన్లపై ఉత్తమ ఆఫర్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2019 సేల్స్ జరగడానికి ముందే అమెజాన్ మొబైల్ ఫోన్ల మీద అందించే కొన్ని ముఖ్యమైన ఆఫర్లను వెల్లడించింది. ఈ వారం చివరి రోజు అంటే శనివారం ప్రైమ్ మెంబెర్స్ కు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ మొదలవుతాయి. మిగిలిన వారికి ఆదివారం నుంచి మొదలవుతాయి. మునుపటి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో అందించిన ఆఫర్లకు సమానమైన ఆఫర్లను ఇప్పుడు కూడా కొన్ని మార్పులతో మీరు ఆశించవచ్చు.

అమెజాన్ దీపావళికి ఇస్తున్న బహుమతి....స్మార్ట్‌ఫోన్‌ల ఆఫర్లు

 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2019 సేల్స్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన వన్‌ప్లస్ 7ను మరోసారి రూ.29,999ల డిస్కౌంట్ ధరకు అందించనున్నారు. దీని MRP ధర రూ.32,999లు. అలాగే ప్రస్తుతం రూ.5,249ల ధరతో వున్న రెడ్‌మి 7 ఎ ఫోన్ ను కేవలం రూ.4,999లకు అందించనున్నారు. శామ్‌సంగ్ గెలాక్సీ M30 ను కూడా రూ.9,999 వద్ద మరియు వన్‌ప్లస్ 7 ప్రో ను రూ.44,999 ధర వద్ద అందివ్వనున్నారు..

అమెజాన్ దీపావళికి ఇస్తున్న బహుమతి....స్మార్ట్‌ఫోన్‌ల ఆఫర్లు

ఈ ఫెస్టివల్ సేల్స్ లో ఐఫోన్ XRను రూ.44,999, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9ను రూ.42,999 (MRP రూ.73,600) డిస్కౌంట్ ధరకు లభించనున్నది. అమెజాన్ యొక్క మునుపటి సేల్స్ మాదిరిగానే శామ్‌సంగ్ గెలాక్సీ M30 ల మీద రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ M10 ను రూ.8,999లకు (MRP రూ.10,000) లభిస్తుంది.

అమెజాన్ దీపావళికి ఇస్తున్న బహుమతి....స్మార్ట్‌ఫోన్‌ల ఆఫర్లు

అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సమయంలో హువాయి యొక్క P30 లైట్ ను రూ.15,990 (MRP రూ.21,990), శామ్‌సంగ్ గెలాక్సీ A 50 రూ.18,990 (MRP రూ. 24,000) లకు లభిస్తుంది. ఈ సమయంలో అమెజాన్ అదనంగా గెలాక్సీ నోట్ 10+ ను కొనుగోలు చేసినప్పుడు మీ పాత స్మార్ట్‌ఫోన్ యొక్క సాధారణ ఎక్స్చేంజ్ విలువ రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

అమెజాన్ దీపావళికి ఇస్తున్న బహుమతి....స్మార్ట్‌ఫోన్‌ల ఆఫర్లు

ఎలక్ట్రానిక్స్ పై ఉత్తమ ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లపై అందించే ఆఫర్లతో పాటు అమెజాన్ ఈ ఏడాది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2019 సేల్స్ సందర్భంగా ఎలక్ట్రానిక్స్ వస్తవులపై కూడా కొన్ని ఒప్పందాలు మరియు ఆఫర్లను వెల్లడించింది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్, కెమెరాలు, ఇయర్‌ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై అమెజాన్ వందలాది ఒప్పందాలను అందిస్తుంది.

అమెజాన్ దీపావళికి ఇస్తున్న బహుమతి....స్మార్ట్‌ఫోన్‌ల ఆఫర్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సమయంలో ఇంటెల్ కోర్ ఐ 5 ప్రాసెసర్‌తో పనిచేసే డెల్ ఇన్స్పైరాన్ 3480 ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.40,990 (MRP రూ.50,225) లకు అందించనున్నది. అలెక్సా స్పీకర్ డాక్‌తో ఉన్న లెనోవా స్మార్ట్ టాబ్ M10 రూ.16,990 (MRP రూ .30,000). బోట్ ఎయిర్‌డోప్స్ ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్, శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్, కానన్ EOS 1500 D DSLRకెమెరా మరియు బోస్ సోలో 5 సౌండ్‌బార్‌లను కూడా ఈ సేల్స్ సమయంలో అమెజాన్ తక్కువ ధరలను టీజ్ చేస్తోంది. అమెజాన్ అందించే మరిన్ని ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి అమెజాన్ యొక్క వెబ్ పేజీని ఓపెన్ చేయండి.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival 2019 Sale: Smartphones and Electronics Device Offers Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X