Amazon great indian Festival 2023 అమెజాన్ సేల్ తేదీలు ఖరారు.. వీటిపై భారీగా డిస్కౌంట్లు!
Amazon great indian Festival 2023 సేల్ తేదీని అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 8న ప్రారంభం కానుంది. అయితే ఎన్నిరోజులపాటు నిర్వహించనుందనే సమాచారం మాత్రం వెల్లడించలేదు. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లు మాత్రం అక్టోబర్ 7 అర్ధరాత్రి నుంచి సేల్‌లో పాల్గొనవచ్చు.
ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా డీల్స్, డిస్కౌంట్లను ఇప్పటికే వెల్లడించింది. SBI కార్డులు కలిగిన కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు పొందవచ్చని తెలిపింది. మొబైల్, ఇతర ఉపకరణాలుపై 40 శాతం వరకు డిస్కౌంట్లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

ఈ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్మార్ట్‌వాచ్, ట్యాబ్లెట్లు, ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌టీవీలు ఇతర గృహ ఉపకరణాలపై ఆఫర్లు, డిస్కౌంట్లకు సంబంధించి ప్రత్యేక వెబ్‌పేజీని క్రియేట్ చేసింది. ఆపిల్, ఆసుస్, లెనోవా, వన్‌ప్లస్, ఐకూ, రియల్‌మీ, శాంసంగ్, బోట్ మరియు సోనీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతోపాటు ఎకో, ఫైర్ టీవీ వంటి మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ అక్టోబర్ 8న ప్రారంభం కానుండగా.. దీంతోపాటు మరిన్ని సేల్‌లు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ సేల్‌లో ప్రైమ్ కస్టమర్లు ముందుగా యాక్సెస్ పొందవచ్చు. దీంతోపాటు అదనపు క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, అదనపు వారంటీ పొందే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S23, నోకియా G42 5G, మోటోరోలా Razr 40, Tecno Pova 5 pro, రెడ్‌మీ 10 పవర్, లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్లు సహా వన్‌ప్లస్ నార్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ M34 5G, రెడ్‌మీ 12 5G ఫోన్లను కూడా డిస్కౌంట్లతో కొనుగోలు చేసే అవకాశం ఉంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ కోసం ఈ కామర్స్ సంస్థ SBIతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఈ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందనున్నారు. దీంతోపాటు అమెజాన్ పే, కూపన్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.
మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్డు కూడా బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్‌ను ప్రకటన చేసింది అక్టోబర్ 8న ప్రారంభమై 15 తేదీన ముగుస్తుంది. ఈ సేల్‌లో ఆపిల్ ఐఫోన్‌లను అతి తక్కువ ధరలకు అందిస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరలకే పొందవచ్చని భావిస్తున్నారు.
ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సి్స్ బ్యాంక్, కోటర్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్డులపై కొనుగోలు చేసిన వారు 10 శాతం తక్షణ తగ్గింపును పొందుతారని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఈ తగ్గింపు రూ.1500 లకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








