Home
News

Amazon Great Indian Festival 2024 Sale.. 40 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్‌లు..!

అమెజాన్‌ కీలక ప్రకటన చేసింది. పండుగల సీజన్ సందర్భంగా ప్రత్యేక సేల్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2024 పేరుతో ఈ సేల్‌ జరగనుంది. ఈ సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందో అమెజాన్‌ వెల్లడించలేదు. అయితే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2024 సేల్‌ (Amazon Great Indian Festival 2024 Sale) డిస్కౌంట్‌ ధరలను వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా SBI కార్డుల ద్వారా డిస్కౌంట్‌లను పొందవచ్చని తెలిపింది. ఇప్పటికే మరో ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌ వివరాలను వెల్లడించింది.

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2024 సేల్‌ కోసం మొబైల్స్‌, గేమింగ్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలు సహా ఇతర లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తుల కేటగిరీలతో ప్రత్యేక మైక్రోసైట్‌ను రూపొందించింది. ప్రముఖ బ్రాండ్‌లు ఆపిల్‌, శాంసంగ్‌, డెల్‌, సోనీ, షియోమీ సహా ఇతర బ్రాండ్ల ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.

విమాన టికెట్లపైనా డిస్కౌంట్‌లు :
ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా మొబైల్‌, వాటి విడిభాగాలపై 40 శాతం, ట్యాబ్లెట్‌లపై 60 శాతం, స్మార్ట్‌టీవీ, ప్రొజెక్టర్‌లపై 60 శాతం, హెడ్‌ఫోన్‌లపై 70 శాతం, గేమింగ్‌ పరికరాలు సహా ఇతర ఉత్పత్తులపై 70 శాతం తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చని అమెజాన్ తెలిపింది. విమాన టికెట్లు, రైలు, బస్సు టికెట్లు, హోటల్‌ బుకింగ్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చని పేర్కొంది.

SBI కార్డులపై 10 శాతం తగ్గింపు :
ఈ అమెజాన్ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ 2024 సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌, డెబిట్‌ కార్డుపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగిన వారికి క్యాష్‌బ్యాక్‌ సహా మరిన్ని ప్రయోజనాలు అందించనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ :
మరో ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ పేరుతో సెప్టెంబర్ 27 నుంచి సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లు 24 గంటల ముందుగానే అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్‌, టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల సహా ఇతర ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.

ఈ సేల్‌లో భాగంగా HDFC క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు UPI ద్వారా చెల్లింపులు నిర్వహిస్తే రూ.50 తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా నో కాస్ట్ EMI ప్రయోజనాలు కూడా ఉంటాయి. మరియు ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ద్వారా లక్ష వరకు క్రెడిట్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

సెప్టెంబర్‌ 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్ ప్రారంభం కానుంది. Big Sale Of Small Things పేరుతో సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డుపై 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్ EMI ను కూడా పొందవచ్చు. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు సహా ఇతర వస్తువులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon great indian festival 2024 sale announced here are the deals and discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X