అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. పూర్తి జాబితా..!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ (Amazon Great Indian Festival 2024 Sale) తేదీలు ఇటీవల వెల‌్లడయ్యాయి. సెప్టెంబర్ 29 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని సంస్థ వెల్లడించింది. అయితే ఈ సేల్ ఎప్పటి వరకు నిర్వహించనున్నారనే సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో వన్‌ప్లస్, పోకో సహా మరెన్నో బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయని పేర్కొంది.
అమెజాన్ పేజీ ఆధారంగా వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12R, వన్‌ప్లస్ 11R, వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్, వన్‌ప్లస్ నార్డ్ CE 4 సహా రియల్‌మి GT 6T, నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్‌లను పొందవచ్చని పేర్కొంది. దీంతోపాటు ఐకూ 12, ఐకూ నియో 9 ప్రో, ఐకూ Z9 లైట్, ఐకూ Z9, ఐకూ Z9s ప్రో హ్యాండ్‌సెట్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

దీంతోపాటు ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ M15 సహా షియోమీ స్మార్ట్‌ఫోన్‌లపైనా డిస్కౌంట్లను పొందవచ్చని తెలిపింది. ఒప్పో, వివో, హానర్, టెక్నో సహా మరిన్ని బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్‌లను ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటన చేసింది. స్మార్ట్‌ఫోన్‌ల విడిభాగాలపై 80 శాతం డిస్కౌంట్, కొన్ని ల్యాప్‌టాప్‌లపై 40 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది. దీంతోపాటు కేవలం రూ.6999 నుంచే స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయవచ్చు.
ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా వాషింగ్ మెషిన్‌లపై 60 శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్, సెమీ ఆటోమేటిక్ వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. మరియు రీఫ్రిజిరేటర్‌లను 55 శాతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. సింగిల్ డోర్, డబుల్ డోర్, సైడ్ బై సైడ్ డోర్ మోడళ్లను కొనుగోలు చేయవచ్చు.
దీంతోపాటు ఈ సేల్‌లో భాగంగా ఎయిర్ కండిషనర్‌లపైన 55 శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. స్ప్లిట్, విండో సహా ఇన్వర్టర్ AC మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు అధిక పనితీరును కనబరిచే ఎయిర్ కండిషనర్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.
ఈ సేల్‌లో రూ.799 ప్రారంభ ధర నుంచి స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేయవచ్చు. మరియు హెడ్‌ఫోన్స్‌ను రూ.699 ధర నుంచే సేల్‌కు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు అమెజాన్ పరికరాలను రూ.1999 కే కొనుగోలు చేయవచ్చు. ఎకో స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సేల్‌లో భాగంగా SBI బ్యాంకు కార్డులతో 10 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు.
మరో ఇ-కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు 26వ తేదీ నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా HDFC క్రెడిట్, డెబిట్ కార్డులతో డిస్కౌంట్ ధరలకే కొనుగోలు చేయవచ్చు. మరియు UPI ద్వారా రూ.50 తగ్గింపును పొందవచ్చు. నో కాస్ట్ EMI ప్రయోజనాలను కూడా వినియోగించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా లక్ష వరకు క్రెడిట్ సదుపాయం పొందవచ్చు.


Click it and Unblock the Notifications