అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్.. ఈ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్.. పూర్తి వివరాలు..!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ (Amazon Great Indian Festival 2024 Sale) సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్స్ సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లపై భారీ తగ్గింపు ధరను పొందవచ్చని అమెజాన్ వెల్లడించింది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు సహా హ్యాండ్‌సెట్‌లపై డిస్కౌంట్ ధరలను వెల్లడించింది. వన్‌ప్లస్, పోకో, రియల్‌మి, షియోమీ సహా ఇతర మోడళ్లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12R, వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్, వన్‌ప్లస్ నార్డ్ CE 4, వన్‌ప్లస్ 11R సహా రియల్‌మి మోడళ్లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. అయితే ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 13 ను (iPhone 13 Discount Price) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 బేస్ వేరియంట్‌ను రూ.38,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 13 ను 2021 సంవత్సరంలో విడుదల చేశారు. 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు A15 బయోనిక్ చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఈ మోడల్ వెనుకవైపు 12MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరాలను కలిగి ఉంది. ఈ మోడల్ స్లీక్ డిజైన్, కట్టింగ్ ఎడ్జ్ ఫీచర్లుతో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ధర రూ.38,999 కే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో భాగంగా ఐకూ 12, ఐకూ నియో 9 ప్రో, ఐకూ Z9 లైట్, ఐకూ Z9, ఐకూ Z9s ప్రో స్మార్ట్‌ఫోన్‌లు సహా గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ M15 హ్యాండ్‌సెట్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు ఒప్పో, వివో, హానర్, టెక్నో వంటి బ్రాండ్ల హ్యాండ్‌లను కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల విడిభాగాలపై 80 శాతం, కొన్ని ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు వాషింగ్ మెషిన్‌లపై 60 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నాయి. రీఫ్రిజిరేటర్‌లను 55 శాతం డిస్కౌంట్, ఎయిర్ కండిషనర్‌లపైన 55 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందవచ్చు. స్ప్లిట్, విండో, ఇన్వర్టర్ AC మోడళ్లును కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో భాగంగా హెడ్‌ఫోన్‌ల ధరలు రూ.699 నుంచే ప్రారంభం కానున్నాయి. మరియు స్మార్ట్‌వాచ్‌ల ధరలు కూడా రూ.799 ప్రారంభ ధరగా ఉంది. అమెజాన్ ఎకో స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్స్ పైనా భారీ తగ్గింపు ధరలను పొందవచ్చని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








