అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌పై డిస్కౌంట్‌లు!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 (Amazon Great Indian Festival 2025 Sale) ఈనెల 23 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు ఒక రోజు అంటే సెప్టెంబర్ 22 నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. SBI కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్‌లో భాగంగా అందించే డీల్స్ వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి.
షియోమీ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై :
ఈ సేల్‌లో భాగంగా షియోమీ 15 స్మార్ట్‌ఫోన్‌పై రూ.5 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.64,999 గా ఉండగా.. అమెజాన్ సేల్‌లో భాగంగా రూ.59,999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులు, ఎక్స్ఛేంజీ ఆఫర్లతో మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

షియోమీ 15 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.36 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. మూడు 50MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఇతర బ్రాండ్స్ పైనా డిస్కౌంట్‌లు :
ఈ సేల్‌లో భాగంగా షియోమీ 15 స్మార్ట్‌ఫోన్‌తోపాటు షియోమి 14 సివీ, రెడ్‌మి నోట్ 14 ప్రో 5G, రెడ్‌మి 14c 5G, పోకో M6 ప్లస్ 5G, పోకో C71 మోడల్స్ పై డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్ సేల్‌లో భాగంగా షియోమీ, పోకో, రెడ్‌మి ఇతర మోడల్స్‌పైనా డిస్కౌంట్‌లను పొందవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి, లావా, వన్‌ప్లస్, హానర్, శాంసంగ్ వంటి మోడల్స్‌పైనా డిస్కౌంట్‌లను పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ CE4 5G హ్యాండ్‌సెట్‌ను రూ.18499 కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది.

అలాగే ఐకూ మోడల్స్ పైనా మంచి డీల్స్‌ను పొందవచ్చు. ఇప్పటికే వచ్చిన వివరాల ఆధారంగా ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ సేల్‌లో రూ.10998 ధరకే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 50MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
* అమెజాన్ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, టీవీలను కూడా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. మరియు ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ M3 11 అంగుళాల వేరియంట్‌ను రూ.51,999 అందుబాటులోకి రానుంది.
అదే షియోమీ 32 అంగుళాల టీవీని రూ.11,999 కే అందుబాటులోకి రానుంది. దీంతోపాటు అమెజాన్ ఉత్పత్తులపైనా మంచి డీల్స్‌ను పొందవచ్చు. అలెక్సా వాయిస్ రిమోట్‌తో కూడిన పైర్ టీవీ స్టిక్ 4K ను రూ.4499 కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా ఎకో పాప్ స్మార్ట్ స్పీకర్‌ను రూ.2,940 కే సొంతం చేసుకోవచ్చు.
వీటితోపాటు కిండిల్ పేపర్‌వైట్ పై రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తామని చెబుతోంది. మరియు ఫైర్ స్టిక్ HD పై 55 శాతం డిస్కౌంట్, 5వ జెనరేషన్ ఎకో డాట్ పై 20 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని అమెజాన్ చెబుతోంది. మరిన్ని డీల్స్ వివరాలు ఈ వారంలో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications