Home
News

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌.. త్వరలో కేటగిరీల వారీగా ప్రత్యేక డీల్స్‌..!

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ (Amazon Great indian Festival 2025) సెప్టెంబర్ 23 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లు 22 నుంచే సేల్‌ లో పాల్గొనవచ్చు. SBI కార్డులపై కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎల్టక్రానిక్‌ గ్యాడ్జెట్స్‌, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చని తెలుస్తోంది.

వచ్చే వారం నుంచి మరిన్ని డీల్స్‌ :
అమెజాన్‌ లో ఐకూ బ్రాండ్ డీల్స్‌ ఇప్పటికే వెల్లడయ్యాయి. అయితే రియల్‌మి, పోకో, లావా డీల్స్‌ వెల్లడయ్యాయి. త్వరలో వన్‌ప్లస్‌, హానర్‌, శాంసంగ్ వంటి బ్రాండ్స్‌ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. సెప్టెంబర్‌ 17 నుంచి కేటగిరీల వారీగా మరిన్ని ఫెస్టివల్ డీల్స్‌ ను అమెజాన్ వెల్లడించనుంది.

Amazon Great indian Festival 2025 revealed few deals on smartphones  laptops  TVs

రూ.18,499 కే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ :
అమెజాన్‌లో వన్‌ప్లస్‌ నార్డ్ CE4 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈ సేల్‌లో భాగంగా రూ.18499 కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. బ్యాంకు ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో ఈ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తోంది.

రూ.10,998 ధరకే ఐకూ హ్యాండ్‌సెట్ :
ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను అమెజాన్‌లో కేవలం రూ.10,998 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, 50MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. దీంతోపాటు అనేక డీల్స్‌ వివరాలు వెల్లడయ్యాయి.

ట్యాబ్లెట్‌, టీవీలపైనా డిస్కౌంట్ ఆఫర్లు :
అమెజాన్ సేల్‌ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్, టీవీలను కూడా డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్‌ M3 11 అంగుళాల వేరియంట్‌ను రూ.51,999 కే సొంతం చేసుకోవచ్చు. అదే షియోమీ 32 అంగుళాల టీవీని రూ.11,999 కే కొనుగోలు చేయవచ్చు.

దీంతోపాటు అమెజాన్ ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరకు పొందవచ్చు. ఎకో పాప్‌ స్మార్ట్‌ స్పీకర్‌ను 41 శాతం డిస్కౌంట్‌తో రూ.2,940 కే కొనుగోలు చేయవచ్చు. అదే అలెక్సా వాయిస్‌ రిమోట్‌తో కూడిన పైర్‌ టీవీ స్టిక్‌ 4K ను రూ.4499 కే అందుబాటులో ఉంటుందని అమెజాన్ చెబుతోంది.

అమెజాన్ ఉత్పత్తులు :
దీంతోపాటు అమెజాన్ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌లో కిండిల్ పేపర్‌వైట్‌ పై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఫైర్‌ స్టిక్‌ HD పై 55 శాతం. ఎకో డాట్‌ (5వ జనరేషన్‌) పై 20 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్ కూడా సెప్టెంబర్‌ 23 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌, బ్లాక్ మెంబర్లు 24 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. యాక్సెస్‌, SBI కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సేల్‌ చాలా డీల్స్‌ కూడా విడుదల అయ్యాయి.

Best Mobiles in India

English summary
Amazon Great indian Festival 2025 revealed few deals on smartphones, laptops, TVs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X