Home
News

అమెజాన్ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2025 సేల్‌.. ఈ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్..!

Amazon Great Indian Festival 2025 : అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ 2025 పై అధికారిక ప్రకటన వచ్చింది. ఇందుకు సంబంధించిన మైక్రోసైట్‌ లైవ్‌లోకి వచ్చింది. అయితే సేల్‌ కచ్చితంగా ఎప్పటి నుంచి ప్రారంభం కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. ఈ అమెజాన్ సేల్‌ డీల్స్‌ సహా ఇతర వివరాలు వెల్లడయ్యాయి. ఈ సేల్‌ డిస్కౌంట్‌ లు సహా బ్యాంకు ఆఫర్ల వివరాలు.

ఈ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ :
అమెజాన్ సేల్‌ లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌లను పొందవచ్చు. క్రెడిట్‌ కార్డులు, డెబిట్ కార్డులు, EMI ఆప్షన్‌లో డిస్కౌంట్‌ ను పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్ఛేంజీ బోనస్‌ ను కూడా అందించనుంది. మరియు కూపన్ కోడ్‌ ద్వారాను తగ్గింపును పొందవచ్చు.

Amazon Great indian Festival 2025 sale

వీటిపై డిస్కౌంట్‌! :
అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2025 లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్‌ లను పొందవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్‌ను పొందవచ్చని తెలుస్తోంది. గెలాక్సీ S25 సిరీస్‌, S24 సిరీస్‌ వంటి ప్రీమియం మోడల్స్‌ పైనా డిస్కౌంట్‌లను పొందవచ్చు.

ఐఫోన్‌ మోడల్స్‌ పైనా తగ్గింపులు :
ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఐఫోన్‌లపైనా తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఐఫోన్‌ 15 సిరీస్‌ పై డిస్కౌంట్‌లను అందిస్తుందని తెలుస్తోంది. ఫోల్డబుల్‌ మోడల్‌ పైనా తగ్గింపును పొందవచ్చు.

వన్‌ప్లస్‌ మోడల్స్‌ పైనా :
వీటితోపాటు వన్‌ప్లస్‌ 13, వన్‌ప్లస్‌ 13s, వన్‌ప్లస్‌ 13R మోడల్స్‌ పైనా తగ్గింపు ధరలను పొందవచ్చు. అమెజాన్ పండుగ సీజన్‌ సేల్‌ లో భాగంగా వివో V60, ఐకూ 13 సిరీస్‌ ను కూడా డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్‌ సెగ్మెంట్‌ ఫోన్‌ల నుంచి అల్ట్రా ప్రీమియం మోడల్స్‌ పై డిస్కౌంట్స్‌ను పొందవచ్చు.

అమెజాన్‌ సేల్‌ లో భాగంగా HP, బోట్‌, సోనీ సహా అనేక బ్రాండ్స్‌ టీవీలపై గరిష్ఠంగా 80 శాతం డిస్కౌంట్‌లను పొందవచ్చు. దీంతోపాటు LG, సోనీ, శాంసంగ్‌, షియోమీ ప్రొజెక్టర్‌లను గరిష్ఠంగా 65 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌ పై 50 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ :
మరో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా సేల్‌ నుంచి ప్రారంభించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరుతో సేల్‌ జరగనుంది. ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా సేల్‌ తేదీలను వెల్లడించలేదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌, ప్లస్‌, VIP మెంబర్‌షిప్‌ కలిగిన వారు ముందుగానే సేల్‌ లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ పై మంచి డిస్కౌంట్లను పొందవచ్చు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Amazon Great indian Festival 2025 sale teased here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X