Home
News

మళ్లీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేస్తోంది

By Gizbot Bureau

రానున్న రోజులన్నీ పండుగ రోజులే కావడంతో అమెజాన్ మరోమారు 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌’కు రెడీ అవుతోంది. అయితే, ఈ సేల్ ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడించలేదు. ఈ సేల్‌లో భాగంగా ప్రకటించనున్న ఆఫర్లకు సంబంధించి మాత్రం కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ సేల్ తొలుత అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించనున్నట్టు సమాచారం. ఇక, స్టేట్‌బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనంగా 10 శాతం రాయితీ లభించనుంది. ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తుండగా, బజాజ్ ఫిన్‌సెర్వ్ కార్డు యూజర్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ చేయనుంది. అలాగే, అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు 5 శాతం రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి.

స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

వన్‌ప్లస్ 7 ప్రో, షావోమీ ఎంఐ ఏ3, సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఉండబోతున్నాయని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో కొత్త మొబైల్స్ లాంచింగ్, ప్రైస్ కట్, ఎక్స్‌ఛేంజ్, నోకాస్ట్ ఈఎంఐ లాంటి ఆఫర్లు ఉండబోతున్నాయి. హోమ్, కిచెన్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్, ఫిట్‌నెస్ ప్రొడక్ట్స్‌ ఎప్పట్లాగే తగ్గింపు ఉంటుంది.

అమెజాన్ సొంత ప్రొడక్ట్స్

అమెజాన్ సొంత ప్రొడక్ట్స్

టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషీన్స్, ఏసీలు, ఎంఐ బ్యాండ్స్, నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఉండబోతున్నాయి. వీటితో పాటు అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అయిన ఫైర్ టీవీ స్టిక్, కిండిల్‌పై ఆఫర్లు ఉండబోతున్నాయి. 

పేమెంట్ ఆఫర్లు చూస్తే ..

పేమెంట్ ఆఫర్లు చూస్తే ..

ఇక పేమెంట్ ఆఫర్లు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉండబోతోంది. అమెజాన్ డెబిట్ కార్డ్‌పై ఏకంగా రూ.1 లక్ష వరకు క్రెడిట్ లిమిట్ ఆఫర్ చేస్తోంది . డెబిట్ కార్డ్ ఉంటే చాలు. క్రెడిట్ తీసుకోవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డ్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంటుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు.

Flipkart offers

Flipkart offers

అయితే ఫ్లిప్ కార్ట్ దీనికి పోటీగా తన సేల్ ను ప్రకటిస్తుందా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. పూర్తి వివరాలు సేల్ మొదలయ్యే వరకు సస్పెన్స్ గానే ఉన్నాయి. సాధారణంగా అమెజాన్ సేల్ కాగానే ఫ్లిప్ కార్ట్ కంపెనీ కూడా పోటీగా తన సేల్ ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 

Best Mobiles in India

English summary
amazon great indian festival sale 2019 festive season sale deals offer announced
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X