Rs.15000 లోపు LED స్మార్ట్ టీవీలపై అమెజాన్ లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్...
అమెజాన్ యొక్క వార్షిక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ రేపటి నుండి అంటే అక్టోబర్ 17 నుండి ఇండియాలో మొదలుకానున్నాయి. ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ అక్టోబర్ 16న ఈ రోజు నుండి మొదలయ్యాయి. ఇ-కామర్స్ సంస్థ తన యొక్క ఫెస్టివల్ అమ్మకం సమయంలో అందించే డిస్కౌంట్ ఆఫర్లు మరియు తగ్గింపు ఒప్పందాలను ఇప్పటికే వెల్లడించింది. కొనుగోలుదారులు ఈ అమ్మకం సమయంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి చేసిన లావాదేవీలపై 10% తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ అమ్మకంలో స్మార్ట్ టీవీల కొనుగోలు మీద అందించే అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ లో షియోమి Mi టీవీల మీద తగ్గింపు ఆఫర్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సమయంలో చైనా కంపెనీ షియోమి యొక్క 32-ఇంచ్ Mi టివి 4A ప్రోను రూ.13,499 రిటైల్ ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 32 అంగుళాల డిస్ప్లేను 1366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ పరిమాణంలో కలిగి ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది.

శామ్సంగ్ HD రెడీ LED స్మార్ట్ టీవీల మీద 25% తగ్గింపు
శామ్‌సంగ్ వండర్‌టైన్మెంట్ సిరీస్ హెచ్‌డి రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ 2020 మోడల్ ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సమయంలో వినియోగదారులకు రూ.14,990 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. 32 అంగుళాల స్క్రీన్‌తో మరియు డాల్బీ డిజిటల్ ప్లస్‌తో 20 వాట్ల స్పీకర్‌ను కలిగి ఉన్న ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు మీద వినియోగదారులకు అదనంగా 25% వరకు తగ్గింపు కూడా లభిస్తుంది.

LG HD రెడీ స్మార్ట్ LED టీవీల మీద 32% తగ్గింపు
స్మార్ట్ LED టీవీలలో బాగా పాపులర్ అయిన LG సంస్థ యొక్క కొత్త మోడల్ LG హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీల కొనుగోలు మీద అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 32% తగ్గింపు పొందిన తర్వాత దీనిని రూ.14,990 ధర వద్ద లభిస్తుంది. 32-అంగుళాల స్క్రీన్ కలిగిన స్మార్ట్ టీవీ 10W సౌండ్ అవుట్‌పుట్‌తో రెండు స్పీకర్లను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ Y-సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలపై 25% డిస్కౌంట్ ఆఫర్
ప్రముఖ వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ సంస్థ ఇటీవల రూ.19,999 ధర వద్ద విడుదల చేసిన వన్‌ప్లస్ Y-సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ కొనుగోలు మీద అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో డిస్కౌంట్ పొందిన తరువాత ఈ స్మార్ట్ టీవీని ప్రస్తుతం రూ.14,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 60HZ రిఫ్రెష్ రేట్‌తో 32 అంగుళాల పరిమాణంలో స్క్రీన్‌ను కలిగిన ఈ టీవీ బడ్జెట్ దరలోని టీవీ కొనుగోలుకు సరైన ఎంపిక.

TCL ఆండ్రాయిడ్ స్మార్ట్ HD LED టివిలపై 46% అధిక తగ్గింపు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అధిక డిస్కౌంట్ అందుకుంటున్న టీవీలలో TCL టీవీలు ఉన్నాయి. ఇందులో భాగంగా సాదారణముగా రూ .22,990 ధర వద్ద లభించే టిసిఎల్ హెచ్‌డి రెడీ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టివి 32P30S పై 46% తగ్గింపుతో అమ్మకం సమయంలో రూ.12,499 రిటైల్ ధర వద్ద లభిస్తుంది. 32 అంగుళాల స్క్రీన్ పరిమాణంలో 16W సౌండ్ అవుట్‌పుట్ వంటి అద్భుతమైన ఫీచర్లను ఇది కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








