Home
News

Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ త్వరలోనే!!! ఈ బ్యాంక్ వారికి అధిక డిస్కౌంట్ ఆఫర్లు...

ఇండియాలో త్వరలోనే నవరాత్రి దసరా పండుగ సీజన్ మొదలుకానున్నది. 6 నెలల వరకు లాక్ డౌన్ కారణంగాఎవరూ కూడా ఎటువంటి పండుగలను జరుపుకోలేదు. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేయడంతో అందరు ఇప్పుడు సాధారణ జీవితం గడపడం మొదలుపెట్టారు. అయితే అమెజాన్ సైట్లో పండుగ కంటే ముందుగా "అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్" సేల్స్ పేరుతో గొప్ప సేల్స్ మొదలుకానున్నట్లు అమెజాన్ టీజ్ చేసింది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ బ్యాంక్ ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ బ్యాంక్ ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ‘త్వరలో వస్తుంది' అని సంస్థ టీజ్ చేసింది. కాకపోతే అమెజాన్ ఇంకా ఖచ్చితమైన తేదీలను మాత్రం ప్రకటించలేదు. ఈ ఇ-కామర్స్ సైట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ బ్యాంక్ అన్ని డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ ల మీద అన్ని కొనుగోలు మీద EMI లావాదేవీలతో సహా అన్ని కొనుగోళ్ల మీద 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ సభ్యుల అమ్మకం ప్రారంభంలో ప్రారంభమవుతుంది. అమెజాన్ ప్రైమ్ చందా ధర ఒక సంవత్సరానికి రూ.999 కాగా ఒక నెలకు 129రూపాయలు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో తగ్గింపు ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో తగ్గింపు ఆఫర్స్

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కోసం అమెజాన్ సైట్లో ఇప్పటికే ప్రత్యేక పేజీని ప్రచురించింది. ఇందులో అనేక వస్తువులను కొనుగోలు చేయడానికి నో-కాస్ట్ EMI లు, ఎక్స్చేంజ్ ఆఫర్స్ మరియు ప్రోడక్ట్ ప్రొటెక్షన్ వంటి ఆఫర్‌లతో మొబైల్‌లు మరియు వాటి ఉపకరణాల యొక్క ధరలను ఈ పేజీలో ముందుగా జాబితా చేయబడతాయని సూచించింది. ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల మీద కూడా ధరల తగ్గింపు మరియు ఎక్స్చేంజ్ తగ్గింపులతో అందించబడతాయి. అమెజాన్ ఈ విభాగంలో ప్రత్యేక ప్రయోగాలను సూచిస్తుంది. ఎలక్ట్రానిక్స్ మరియు వాటి ఉపకరణాల విభాగంలో 70 శాతం వరకు తగ్గింపు అందించనున్నది.

స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు

స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద అద్భుతమైన తగ్గింపు ఆఫర్‌లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల మీద అద్భుతమైన డిస్కౌంట్‌లు లభిస్తాయి. వీటిని నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు మొబైల్ టోటల్ డ్యామేజీ  ప్రొటెక్షన్‌ వంటివి లభిస్తాయి.

టీవీలు మరియు ఉపకరణాల పై 80% వరకు ఆఫర్ ఉంది.

టీవీలు మరియు ఉపకరణాల పై 80% వరకు ఆఫర్ ఉంది.

టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన ఏదైనా గృహోపకరణాలను కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ ఒక అవకాశంగా ఉంది. టీవీలు మరియు వాటి యొక్క ఉపకరణాల మీద పొడిగించిన వారంటీ, నో-కాస్ట్ ఇఎంఐ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వంటి ఆఫర్లు అధికంగా కనిపిస్తాయి. అమెజాన్ అన్ని పెద్ద ఉపకరణాలపై షెడ్యూల్ డెలివరీను కూడా అందిస్తోంది. ఈ-కామర్స్ సైట్ పాత వస్తువుల మీద 13,500 రూపాయల వరకు ఎక్స్ఛేంజ్, బజాజ్ ఫిన్‌సర్వ్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై నో-కాస్ట్ ఇఎంఐ. బజాజ్ ఫిన్‌సర్వ్ రూ.1 లక్ష క్రెడిట్ లిమిట్ కూడా అందిస్తుంది.

అమెజాన్ ఎకో, ఫైర్ టివి స్టిక్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై తగ్గింపు ఆఫర్

అమెజాన్ ఎకో, ఫైర్ టివి స్టిక్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై తగ్గింపు ఆఫర్

అమెజాన్ యొక్క ఎకో స్మార్ట్ స్పీకర్, ఫైర్ టివి స్టిక్ మరియు కిండ్ల్ వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు రేంజ్ ధరలలో తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ తన ఉత్పత్తులకు కాంబో ఆఫర్లను కూడా ప్రవేశపెట్టనుంది. వీటన్నిటితో పాటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో హోమ్ అండ్ కిచెన్ ఉత్పత్తులపై 60 శాతం వరకు, దుస్తులు మరియు ఉపకరణాలపై 70 శాతం వరకు, ఫుడ్ అండ్ గౌర్మెట్ కేటగిరీకి 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే కెమెరాలు మరియు ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్‌వాచ్‌లు, Bluetooth స్పీకర్లు వంటి ఉపకరణాలు 80% తగ్గింపుతో లభిస్తాయి.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival Sale 2020: Great Offers on Mobiles, Electronics Accessories and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X