Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023.. వీటిపై భారీ డిస్కౌంట్లు..!
Amazon Great indian festival sale 2023 అక్టోబర్ 8 ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్లు అక్టోబర్ 7 అర్ధరాత్రి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా గ్యాడ్జెట్లు, స్మార్ట్‌ఫోన్లు, టీవీ, ట్యాబ్లెట్లు, ఇయర్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అత్యుత్తమ డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. కొన్ని రకాల ఎంపిక చేసిన ఉత్పత్తులపై 89 శాతం డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023లో భాగంగా SBI కార్డులతో కొనుగోలు చేసినట్లయితే 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందుతారు. ఈ సేల్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్లపై ఉత్తమ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ జాబితాలో శాంసంగ్, మోటోరోలా, హానర్, ఆసుస్ సహా మరిన్ని బ్రాండ్లు ఉన్నాయి.

Samsung Galaxy S23 Ultra ఈ ఫోన్‌పై సహా S23 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై 17 శాతం డిస్కౌంట్ పొందుతారు. శాంసంగ్ గెలాక్సీ ఆల్ట్రా S23 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం రూ.1,24,999 ఉంది. విడుదల సమయంలో ఈ ఫోన్ రూ.1,49,999గా ఉంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ S23 ఆల్ట్రా ఫోన్ 6.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13పై పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC. ఈ స్మార్ట్‌ఫోన్ 200MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు 12MP కెమెరా ఉంటుంది.
Motorola Razr 40 ఈ ఫోన్ ఈ సంవత్సరం జూలైలో విడుదల అయింది. లాంచ్ సమయంలో 8GB ర్యామ్+ 256GB స్టోరేజీ వేరియంట్ రూ.89,999గా ఉంది. ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఈ ఫోన్ 49 శాతం డిస్కౌంట్ అంటే రూ.49,999కే కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత MyUXపై పనిచేస్తుంది. 6.9 అంగుళాల పుల్ HD+ pOLED ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 1.5 అంగుళాల OLED అవుటర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 SoC ప్రాసెసర్‌తో వస్తుంది.

Honor MahicBook 14 ఈ ల్యాప్‌టాప్‌ను 47 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు రూ.34,990కు కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు కోర్ i5 ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 8GB ర్యామ్, 512GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది.
Asus TUF Gaming F1 గేమింగ్ కోసం ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఇది మంచి ఎంపిక కానుంది. ఈ ల్యాప్‌ను 31 శాతం డిస్కౌంట్‌కు అంటే రూ.58,990కు కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌ట్యాప్ 15.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు ఈ ల్యాప్ ఇంటెల్ కోర్ i5-11400H ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది విండోస్ 11 OSను కలిగి ఉంటుంది. మరియు 8GB ర్యామ్, 512GB అంతర్గత స్టోరేజీతో వస్తుంది.
Noise Buds VS106 TWS ఇయర్‌ఫోన్లు ఇటీవలే విడుదలయ్యాయి. లాంచింగ్ సమయంలో వీటి ధర రూ.4,499గా ఉంది. అయితే ఈ సేల్‌లో భాగంగా 78 శాతం డిస్కౌంట్‌పై వీటిని కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. అంటే కేవలం రూ.999కే వీటిని సొంతం చేసుకోవచ్చు. ఈ ఇయర్‌ఫోన్లు 50 గంటల ప్లేబ్యాక్‌ను టైంను కలిగి ఉంటాయి. క్వడ్ మైక్ సహా ENC టెక్నాలజీతో వస్తుంది.


Click it and Unblock the Notifications







