Home
News

Amazon Great indian Festival sale 2023.. ఈ స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు..!

పండుగ సీజన్‌ సందర్భంగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2023 ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్‌ 7న ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే ఈ అమెజాన్ సేల్‌ అందుబాటులోకి రాగా.. అక్టోబర్‌ 8 తేదీ నుంచి అందరూ సేల్‌లో పాల్గొంటున్నారు.

ఈ అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఆఫర్లు, డిస్కౌంట్లతో సంబంధం లేకుండా SBI కార్డుల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్ల తక్షణమే 10 శాతం డిస్కౌంట్ పొందనున్నారు. ఈ అమెజాన్‌ సేల్‌ 2023లో భాగంగా అనేక ప్రముఖ సంస్థ స్మార్ట్‌వాచ్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Amazon Great indian Festival sale 2023

Samsung Galaxy Watch 4 Bluetooth : ఈ స్మార్ట్‌వాచ్‌ 40mm, 44mm వేరియంట్లలో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 4 బ్లూటూత్‌ 44mm వేరియంట్ స్మార్ట్‌వాచ్‌ ధర రూ.26999గా ఉంది. ఈ అమెజాన్‌ సేల్‌లో (Amazon Great indian Festival sale 2023) భాగంగా ఈ వాచ్‌పై ఏకంగా 70 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. ఫలితంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను రూ.7999కే సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ తాజాగా Wear OS 4 ఆధారిత One UI 5 అప్‌డేట్‌ను పొందింది. మరియు Exynos W920 SoC పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్‌ 1.5GB ర్యామ్, 16GB స్టోరేజీని కలిగి ఉంటుంది.

AmazFit Pop 3S : విడుదల సమయంలో ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ.3499గా ఉంది. ఈ అమెజాన్‌ సేల్‌లో భాగంగా రూ.2999కే కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ వాచ్‌ 1.96 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు బ్లూటూత్‌ కాలింగ్‌, AI వాయిస్‌ అసిస్టెన్స్‌ ఫీచర్లతో వస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 12 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ రానుంది. 100 వాచ్ ఫేసెస్‌, 100 స్పోర్ట్స్‌ మోడల్‌లో అందుబాటులో ఉంది.

Amazon Great indian Festival sale 2023

Noise ColorFit Ultra 3 : స్మార్ట్‌వాచ్‌లో మెటాలిక్‌ స్ట్రిప్‌ కావాలనుకొనే వారు నాయిస్‌ కలర్‌ఫిట్‌ ఆల్ట్రా 3ను ఎంచుకోవచ్చు. ఈ వాచ్‌ 1.96 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. గెస్చర్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ లెదర్‌, సిలికాన్ స్ట్రిప్‌ వేరియంట్లలోనూ లభిస్తుంది. లాంచింగ్‌ సమయంలో ఈ వాచ్‌ ధర రూ.8999గా ఉంది. ప్రస్తుతం 2999కు కొనుగోలు చేయవచ్చు.

Oneplus Nord Watch : ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ నార్డ్ వాచ్‌ ధర ప్రస్తుతం రూ.3999గా ఉంది. ఈ వాచ్‌ 1.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంంది. మరియు 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 105 ఫిట్‌నెస్‌ మోడ్‌లు మరియు అనేక హెల్త్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 10 రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుందని తెలుస్తోంది.

BoAt Xtend Plus : ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను రూ.1998కే కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ వాచ్‌ ధర రూ.9,499గా ఉంది. ఈ వాచ్‌ 1.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో 100 స్పోర్ట్స్‌ మోడ్‌, హెల్త్‌ ఫీచర్లు ఉన్నాయి. సింగిల్‌ ఛార్జింగ్‌తో సాధారణ వినియోగంలో 7 రోజులపాటు బ్యాటరీ వస్తుందని తెలుస్తోంది.

Fire Boltt Phoenix : అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను రూ.1999కే కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌ బ్లాక్‌, గోల్డ్‌, గ్రే కలర్‌ ఆప్షన్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 700నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో 1.43 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాచ్‌ డయల్‌తో వస్తుంది. మూడు గంటల్లోగా ఈ స్మార్ట్‌వాచ్‌ను పూర్తిగా ఛార్జింగ్‌ చేయవచ్చని సంస్థ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Great indian Festival sale 2023 offers best deals on smartwatches
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X