అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీ వచ్చేసింది.. బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్‌ల పూర్తి వివరాలు..!
Amazon Great indian Festival 2025 Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 గురించి ఇటీవల అనేక వివరాలు వెల్లడయ్యాయి. అంచనా డీల్స్‌తోపాటు బ్యాంకు ఆఫర్ల వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ అమెజాన్ సేల్ ప్రారంభ తేదీ వెల్లడయింది. దీంతోపాటు ప్రైమ్ మెంబర్స్‌కు అందించే ప్రత్యేక ప్రయోజనాల వివరాలు కూడా బయటకు వచ్చాయి.
సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లు సెప్టెంబర్ 22 నుంచే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ సేల్ ఎన్ని రోజులపాటు నిర్వహిస్తారనే సమాచారం వెల్లడి కాలేదు.

ఈ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 లో భాగంగా SBI క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలు, EMI ట్రాన్సాక్షన్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్ సహా గృహోపకరణాలపై డిస్కౌంట్‌లు పొందవచ్చని తెలుస్తోంది.
ఆఫర్ల వివరాలు :
ఈ సేల్‌లో భాగంగా ట్రిండింగ్ డీల్స్, 8PM స్పెషల్స్, బ్లాక్‌బస్టర్ ఎక్స్ఛేంజీ ఆఫర్లు వంటి అనేక ఆఫర్లను అందించనుంది. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌పై బెస్ట్ డీల్స్ ఉంటాయని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్ 6, వన్‌ప్లస్ 13 సిరీస్, ఐకూ 13 5G వంటి మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
అమెజాన్ సేల్‌లో భాగంగా శాంసంగ్, ఇంటెల్, డెల్, ASUS సంస్థల ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా 40 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. వీటితోపాటు ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
మరో ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 కూడా ఈనెలలోనే ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ తేదీలు వెల్లడి కాలేదు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సెప్టెంబర్ 15 నుంచి సేల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్ గురించి టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఆసక్తికర వివరాలు వెల్లడించారు. X పోస్ట్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. సాధారణంగా సేల్ సమయాల్లో ఎక్స్ఛేంజీ ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏదైనా ఫోన్‌ను ఎక్స్ఛేంజీ చేయాలంటే కచ్చితంగా డివైజ్ పనిచేసే స్థితిలో (Working Condition) ఉండాలి. అయితే త్వరలో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మాత్రం మీరు ఊహించని ఆఫర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.
ఏ స్థితిలో ఉన్న ఫోన్ అయినా (Any Condition) ఎక్స్ఛేంజీ చేసుకొనేందుకు ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో అనుమతి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా అధిక సంఖ్యలో ఫ్లిప్‌కార్ట్ యూజర్ల లబ్దిపొందే అవకాశం ఉంది. ఎంత విలువైన ఎక్స్ఛేంజీ బోనస్ అందుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఇ-వ్యర్థాలు తగ్గనున్నాయి.


Click it and Unblock the Notifications








