అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ 2024 ప్రారంభం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. పూర్తి వివరాలు..!
పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్‌తో ముందుకొచ్చాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ ఇవాళ్టి నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు నిన్నటి నుంచే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 (Flipkart Big Billion Days Sale 2024) కూడా ఇవాళ్టి నుంచి అందరికి అందుబాటులోకి రాగా.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు నిన్నటి నుంచే సేల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో (Amazon Great Indian Festival Sale 2024) భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, సహా అమెజాన్ పరికరాలు సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు SBI డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. వన్‌ప్లస్ 12R 5G స్మార్ట్‌ఫోన్ రూ.42999 ధరకు విడుదల కాగా... ప్రస్తుత సేల్‌లో రూ.37999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు 100W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.
అలాగే ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 ల్యాప్‌టాప్‌ను రూ.52,990 కే సొంతం చేసుకోవచ్చు. SBI కార్డులతో రూ.4000 వరకు తగ్గింపును పొందవచ్చు. పాత ల్యాప్‌టాప్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.11900 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ 13.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 లో భాగంగా గూగుల్ పిక్సల్, శాంసంగ్, పోకో, వివో, నథింగ్, CMF సహా మరెన్నో బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా HDFC డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యూపీఐతో రూ.50 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లెటర్ ద్వారా లక్ష వరకు రుణ సదుపాయం పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ A14 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. హ్యాండ్‌సెట్ సాధారణ ధర రూ.15499 గా ఉండేది. ఈ సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డుల ద్వారా రూ.9,249 కే ఈ సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 6.6 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. Exynos 1330 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
దీంతోపాటు ఐఫోన్ 15 సిరీస్ హ్యాండ్‌సెట్‌లను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ప్రో మోడల్‌ను లక్ష కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్‌ను బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.99,999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లను కూడా భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








