అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫస్ట్ డే కలెక్షన్ 750కోట్లు

|

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ గత వారం చివరిలో ప్రారంభమైంది. గడిచిన 36 గంటల్లో ఈ సేల్స్ చాలా రికార్డులను బద్దలుకొట్టింది. ఇ-కామర్స్ దిగ్గజం ప్రైమ్ సైన్-అప్లలోనే ఒకే ఒక రోజులో అతిపెద్ద సేల్ ను చూసింది. 66 శాతం ప్రైమ్ సభ్యులు 24 గంటల్లో టైర్ 2 మరియు టైర్ 3 పట్టణాల నుండి షాపింగ్ చేశారు. కొత్త కస్టమర్లను ఆకర్షించిన ఈ ఫెస్టివల్ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు మరియు వాటి ఉపకరణాలు మరియు టీవీలు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. Whirlpool, శామ్‌సంగ్, ఐఎఫ్‌బి మరియు ఎల్‌జి వంటి బ్రాండ్లు దాదాపు 10x వృద్ధిని సాధించాయి.

స్మార్ట్‌ఫోన్ బిజినెస్
 

వన్‌ప్లస్, శామ్‌సంగ్, ఆపిల్ వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కేవలం 36 గంటల్లో సుమారు 750 కోట్ల బిజినెస్ చేసాయి. పెద్ద టీవీలు కూడా సగటు వ్యాపార రోజులలో కంటే దాదాపు 10x వృద్ధిని పొందాయి. ఆసక్తికరంగా కస్టమర్లు స్మార్ట్ హోమ్ ఉత్పత్తులపై చాలా ఆసక్తి చూపించారు. ఎకో డాట్ స్మార్ట్ లైట్లను కొనుగోలు చేసిన వినియోగదారుల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 10x ఎక్కువ.

60 లక్షల 4G స్మార్ట్‌ఫోన్ లతో అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్స్

ఎకో డాట్

ఎకో డాట్ అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులలో ఒకటి అని అమెజాన్ పేర్కొంది. ఎకో డివైస్ లు గత సంవత్సరంతో పోల్చితే ఫెస్టివల్ సేల్స్ మొదటి 36 గంటల్లో 4x రెట్లు ఎక్కువ అమ్మకాలు జరిగాయి. సోనీ, టిసిఎల్ వంటి అగ్ర బ్రాండ్ల ఫైర్ టివి స్టిక్ మరియు అలెక్సా అంతర్నిర్మిత పరికరాలు సగటు వ్యాపార రోజులలో కంటే ఇప్పుడు అమ్మకాలు 50x రెట్ల పెరుగుదల కనిపించాయి. కిండ్ల్ శ్రేణి యొక్క సగటు వ్యాపార రోజు కంటే 20x వృద్ధిని సాధించింది.

అమెజాన్ ఫెస్టివల్ షాపింగ్‌లో ఈ జాగ్రత్తలు పాటించండి

వాషింగ్ మెషీన్

ఇండియాలో విక్రయించబడుతున్న మూడు పూర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లలో ప్రతి ఒక్కటి అమెజాన్.ఇన్ ద్వారా జరిగిందని కంపెనీ తెలిపింది. ఇంకా రిఫ్రిజిరేటర్ యొక్క రెండు డిష్వాషర్లలో ప్రతి ఒక్కటి అమెజాన్.ఇన్ ద్వారా ఉన్నాయి. EMI సౌకర్యం 100 శాతం పెరిగింది. 75 శాతం వినియోగదారులు టైర్ 2 మరియు 3 నగరాల నుండి కొనుగోలు చేసారు. నలుగురు కస్టమర్లలో ముగ్గురు నో కాస్ట్ ఇఎంఐ ఆఫర్లను ఎంచుకుంటున్నారు. క్రెడిట్ కార్డు పొందే వినియోగదారుల సంఖ్య గత సంవత్సరం ఫెస్టివల్ కాలంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగింది.

అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ ల లో ఈ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ లు

అమ్మకందారులు
 

అమ్మకందారులు

గతంలో కంటే ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది కొత్త వినియోగదారులు ఉన్నారని టెక్ దిగ్గజం పేర్కొంది. వీరిలో 91 శాతం మంది టైర్ 2 మరియు టైర్ 3 పట్టణాల నుండి వచ్చారు. వెల్‌కేర్ ఇండియా, బెంగళూరు రిఫైనరీ, ట్యాగ్, డురాఫిట్, హాఫెన్, క్రాస్‌బీట్స్, ట్రైబ్స్ ఇండియా, ఇక్కాట్ పీకాక్, ఇండియన్ బ్లూ ఆర్ట్ కుమ్మరి, మరియు కాశీ చీరలు అమ్మకందారుల గురించి మాట్లాడుతూ వీరు ఒకే రోజులో 2500 మందికి పైగా అమ్మకందారులు తమ అత్యధిక అమ్మకాలను నమోదు చేశారు. ఇంకా 42,500 మంది అమ్మకందారులు సేల్ యొక్క మొదటి 36 గంటలలో కనీసం ఒక కస్టమర్ ఆర్డర్‌ను అందుకున్నారు.

ఫెస్టివల్ సేల్స్ లో షియోమి ప్రభంజనం

ఫ్యాషన్

ఫ్యాషన్ విభాగం కూడా 4.6x జంప్‌తో అత్యధిక సంఖ్యలో నమోదైంది. సాధారణ రోజులతో పోలిస్తే కిరాణా షాపింగ్ కూడా 3.5x పైగా పెరిగింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ యొక్క మొదటి 36 గంటలు డిజిటల్ ఇండియా నుండి రికార్డు స్థాయిలో పాల్గొనడం మాకు గర్వంగా ఉంది అని అమెజాన్ డైరెక్టర్ తెలిపారు.

 ప్రైమ్ మెంబెర్ షిప్

రికార్డ్ స్థాయిలో ప్రైమ్ మెంబెర్ షిప్ కోసం సైన్-అప్‌ అయ్యారు. మునుపెన్నడూ లేనంతగా చిన్న పట్టణాల నుండి ఎక్కువ మంది దుకాణదారులు మొదటిసారి ఇండియా అంతటా పదివేల మంది చిన్న అమ్మకందారులు ఇప్పటికే విజయాన్ని చూస్తున్నారు. అతిపెద్ద ఎంపిక, గొప్ప సౌలభ్యం మరియు అసాధారణమైన విలువను అందించే అమెజాన్ నిబద్ధతను ఇండియాలో అందరు గౌరవించడం మాకు సంతోషంగా ఉంది అని అమెజాన్ ఇండియా గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ అన్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival Sale Day 1: Rs 750 crore worth of Smartphones Sold out

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X