అమెజాన్ సేల్ మొదలైంది, ఆఫర్లు & ధరల వివరాలు!
అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇప్పుడు ప్రైమ్ సభ్యుల కోసం ఇప్పుడు మొదలైంది. ప్రైమ్ సభ్యులు కానీ మిగిలిన వినియోగదారుల కోసం ఒక రోజు తర్వాత అంటే అక్టోబర్ 8న సేల్ ప్రారంభమవుతుంది. ఈ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో సమానంగా పోటీగా ఉంటుంది.
పోటీ పడుతున్న ఇ-కామర్స్ సైట్‌లు రెండూ, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు మరియు ఇతర ఉపకరణాలపై లాభదాయకమైన ఆఫర్లను అందిస్తున్నాయి. విస్తృత శ్రేణి నాన్-ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆఫర్‌లు కూడా ఉన్నాయి. కస్టమర్‌లు ఈ సేల్ డిస్కౌంట్‌లను పక్కన పెడితే అదనపు బ్యాంక్ ఆఫర్‌లు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ వివరాలు
Samsung Galaxy S23 ధర రూ. 6,000 తగ్గింపుతో మరియు రూ.8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ తో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5 మరియు గెలాక్సీ Z ఫోల్డ్ 5 గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో నెలకు రూ.7,749 నుండి నో-కాస్ట్ EMI ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.
హానర్ 90 5G, సెగ్మెంట్ యొక్క మొదటి క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉందని పేర్కొంటూ, తక్కువ ధరకు రూ. 26,999 అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఇటీవల విడుదల చేసిన నోకియా G42 5G ఇప్పుడు రూ. 10,799 కి అన్ని ఆఫర్‌లతో సహా అందుబాటులో ఉంటుంది.
ఇంకా, వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ 5G, షియోమీ 13 ప్రో 5G, మోటోరోలా రేజర్ 40 అల్ట్రా మరియు ఐక్యూ Z7 ప్రో 5G వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి ఇతర స్మార్ట్‌ఫోన్‌లు కూడా సేల్ డిస్కౌంట్‌లు మరియు ఇతర డీల్స్‌తో ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి.
Redmi Buds 4 Active వంటి యాక్సెసరీలు రూ.899 నుండి అందుబాటులో ఉంటాయి. పవర్ బ్యాంక్‌లు మరియు ఛార్జర్‌ల వంటి ఇతర మొబైల్ ఉపకరణాలు కూడా తక్కువ ధరలకు అందించబడతాయి. నాయిస్, బోట్ మరియు ఫైర్‌బోల్ట్ వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌వాచ్‌లు రూ.1,499 నుండి ప్రారంభమవుతాయి. ఆపిల్ వాచ్ SE (GPS + సెల్యులార్) తగ్గింపు ధర రూ. 19,990 తో అమ్మకానికి ఉంది.
ఇక, ల్యాప్‌టాప్‌లలో ఆఫర్లు గమనిస్తే, MacBook Air M1ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇది రూ.62,990 కు అందుబాటులో ఉంది. ఇది 12 నెలల, నో-కాస్ట్ EMI ఎంపికతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఆసుస్ వివోబుక్ 15 ఇంటెల్ ఐ7, డెల్ 14 ఇంటెల్ కోర్ ఐ5 మరియు హెచ్‌పి విక్టస్ RTX 3050 వంటి ఇతర మోడల్‌లు సేల్ సమయంలో తక్కువ ధరలకు అందించబడుతున్నాయి.
ఇంకా, Sony, Samsung, LG, Redmi, Hisense, Acer, TCL మరియు Vu వంటి అగ్ర బ్రాండ్‌ల నుండి స్మార్ట్ టెలివిజన్‌లు కూడా లాభదాయకమైన ధరలలో అందించబడతాయి మరియు నో-కాస్ట్ EMI మరియు బై నౌ పే లేటర్ ఆప్షన్‌లు వంటి ఇతర ఆఫర్‌లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








