అమెజాన్ సేల్ మళ్లి వస్తోంది, రెండు గంటల్లోనే డెలివరీ!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో గ్రేట్ ఇండియన్ షెస్టివల్ సేల్‌కు సిద్థమవుతోంది. ‘వేవ్ 2’ పేరుతో అనౌన్స్ కాబడిన ఈ సేల్ అక్టోబర్ 24, 2018న ప్రారంభమై అక్టోబర్ 28, 2018న ముగుస్తుంది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో గ్రేట్ ఇండియన్ షెస్టివల్ సేల్‌కు సిద్థమవుతోంది. 'వేవ్ 2’ పేరుతో అనౌన్స్ కాబడిన ఈ సేల్ అక్టోబర్ 24, 2018న ప్రారంభమై అక్టోబర్ 28, 2018న ముగుస్తుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, హోమ్ అప్లయిన్సెస్, ఫ్యాషన్, కన్స్యూమబుల్స్, బ్యూటీ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తదితర వాటిపై భారీ నుంచి అతి భారీ డిస్కౌంట్లను అందించబోతున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మరికాస్త ముందు..
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా లభించే బెస్ట్ డీల్స్‌ను అమెజాన్ ప్రైమ్ యూజర్లు మరికాస్త ముందగా యాక్సిస్ చేసుకునే వీలుంటుందని అమెజాన్ వెల్లడించింది. ఇదే సమయంలో అమెజాన్ ఫైర్ టీవీతో పాటు ఇకో థర్డ్ జనరేషన్ అమెజాన్ డివైసెస్‌ను కూడా సేల్‌లో ఉంచుతున్నట్లు సంస్థ తెలిపింది.

ప్రతిరోజు ఫ్లాష్‌సేల్ పై రెడ్‌మి 6ఏ..
ఈ సేల్‌లో భాగంగా ఏఏ మోడల్ స్మార్ట్‌ఫోన్స్ ధర తగ్గింపు పై అందుబాటులో ఉంటాయన్నది అమెజాన్ వెల్లడించలేదు. కంపెనీ రివీల్ చేసిన దాని ప్రకారం ఈ 5 రోజుల సేల్ పిరియడ్‌లో భాగంగా షావోమి రెడ్‌మి 6ఏ డివైస్ ఫ్లాష్‌సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభ మవుతుంది. ఈ ఫోన్‌తో పాటు మరికొన్ని బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా స్పెషల్ డిస్కౌంట్ ధరల పై అందుబాటులో ఉంచనున్నట్లు అమెజాన్ పేర్కొంది.

స్మార్ట్‌టీవీల పై 60 శాతం వరకు డిస్కౌంట్స్..
ఇక టీవీల విషయానికి వచ్చేసరికి ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్‌టీవీల పై 60 శాతం వరకు డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో హోమ్ అప్లయిన్సెస్ పై 80 శాతం, అలెక్సా బిల్ట్-ఇన్ డివైసెస్ పై 70శాతం రాయితీలను సిద్థం చేసినట్లు అమెజాన్ వెల్లడించింది.

రెండు గంటల్లోనే డెలివరీ...
ఇక క్యాష్‌బ్యాక్స్ వచ్చేసరికి ఐసీఐసీఐ అలానే సిటీ బ్యాంక్ కస్టమర్‌లకు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటందని అమెజాన్ తెలిపింది. ఇదే సమయంలో జాజ్ ఫిన్‌సర్వ్ కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్ల పై నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇదే సమయంలో అమెజాన్ పే బ్యాలన్స్ ద్వారా చెల్లింపులు చేసే వారికి రూ.300 వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై ఇంకా హైదరాబాద్ నగరాల్లోని అమెజాన్ ప్రైమ్ యూజర్లకు రెండు గంటల్లోనే డెలివరీ అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








