Home
News

నవంబర్ 2 నుంచి మొదలు కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

అమెజాన్ కూడా దీపావళి సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను మరో సారి నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే . ఈ క్రమంలోనే మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా దీపావళి సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను మరో సారి నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దసరా సందర్భంగా ఈ సేల్‌ను అమెజాన్ నిర్వహించగా, దీపావళి నేపథ్యంలో మరోసారి ఈ సేల్‌ను నిర్వహించనుంది. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరగనుంది. తాజాగా విడుదలైన వన్‌ప్లస్ 6టి ఫోన్‌ను ఈ సేల్‌లో విక్రయించనున్నారు. అలాగే రెడ్‌మీ 6 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎ8ప్లస్, రియ‌ల్‌మి1 వంటి మొబైల్స్ వాటిపై భారీ ఆఫర్లు లభించనున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీతో భాగస్వామ్యం కదుర్చుకున్న అమెజాన్....

హెచ్‌డీఎఫ్‌సీతో భాగస్వామ్యం కదుర్చుకున్న అమెజాన్....

హెచ్‌డీఎఫ్‌సీతో భాగస్వామ్యం కదుర్చుకున్న అమెజాన్ డెబిట్, క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లకు పదిశాతం రాయితీ ఇవ్వనుంది. ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. రూ.2 వేల నుంచి రూ.4,999 మధ్య జరిపే కొనుగోళ్లపై అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. రూ.5వేలు ఆపైన జరిపే కొనుగోళ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో క్యాష్ బ్యాక్ లభించనుంది

కొత్త కస్టమర్‌కు ఉచిత డెలివరీ....

కొత్త కస్టమర్‌కు ఉచిత డెలివరీ....

దీంతోపాటు కొత్త కస్టమర్‌కు ఉచిత డెలివరీ, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, బుక్‌మైషో, స్విగ్గీ వోచర్లు, అమెజాన్ పే బ్యాలెన్స్ ఇవ్వనుంది. రూ.500 అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసే వారికి ఈ ప్రయోజనాలు లభిస్తాయి.

పలు ఉత్పత్తులపై అమెజాన్....

పలు ఉత్పత్తులపై అమెజాన్....

పలు ఉత్పత్తులపై అమెజాన్ నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందివ్వనుంది. ఫోన్లు, హెడ్‌ఫోన్స్, కెమెరాలు, హోం, కిచెన్ ఉత్పత్తులు, అమెజాన్ ఎకో డివైస్‌లపై ఆకట్టుకునే ఆఫర్లను ఈ సేల్‌లో అందివ్వనున్నారు.

వన్‌ప్లస్ 6టి ఫీచర్లు....

వన్‌ప్లస్ 6టి ఫీచర్లు....

6.41 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

 రెడ్‌మీ 6 ప్రొ ఫీచర్లు....

రెడ్‌మీ 6 ప్రొ ఫీచర్లు....

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 625 ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ ఫీచర్లు....

శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ ఫీచర్లు....

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు....

రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు....

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival Sale will be back during November 2-5.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X