అక్టోబర్ 10 నుంచి అమెజాన్ పండగ సేల్
దసరా, దీపావళి సీజన్ సందర్భంగా భారీ ఆఫర్లు, డీల్స్‌తో ఈ నెల 10 నుంచి 15 వరకు ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ను పేరుతో పండుగ సేల్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
దసరా, దీపావళి సీజన్ సందర్భంగా భారీ ఆఫర్లు, డీల్స్‌తో ఈ నెల 10 నుంచి 15 వరకు ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్'ను పేరుతో పండుగ సేల్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. తమ ప్రైమ్ కస్టమర్లకు ఈ డీల్స్‌ను, ఆఫర్లను ముందే చూసే అవకాశం ఉంటుందని కూడా తెలియజేసింది. స్మార్ట్‌ఫోన్లు, టీవీల వంటి గృహోపకరణాలు, హోమ్-కిచెన్ ఉత్పత్తులు, ఫ్యాషన్ వస్తువులతో పాటు గ్రోసరీ, కన్సూమర్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తదితరాలపై ఈ 5 రోజులూ భారీ ఆఫర్లు కొనసాగుతాయని తెలియజేసింది. అక్టోబరు 10న అర్ధరాత్రి 12 గంటలకు మొదలయ్యే ఈ ఫెస్టివల్... అక్టోబరు 15 రాత్రి 11.59కి ముగుస్తుంది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లించేవారికి 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు అమెజాన్ వాలెట్‌లో సొమ్ము వేస్తే అదనంగా రూ.300 క్యాష్‌బ్యాక్ ఉంటుంది.

డెబిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయం, అమెజాన్ సంచలనం
ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం అమెజాన్ మరో సంచలనంతో దూసుకువచ్చింది. ఇప్పటిదాకా క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే ఉన్న ఈఎంఐ సదుపాయాన్ని డెబిట్ కార్డులకు కూడా కల్పించింది. క్రెడిట్ కార్డు అవరం లేకుండా డెబిట్ కార్డు ద్వారా మీరు వస్తువులను ఈఎంఐ సదుపాయంలో కొనుగోలు చేయవచ్చు. నమ్మలేకున్నా ఇది నిజం. అమెజాన్‌లో ఇప్పుడు అమెజాన్ పే ఈఎంఐ పేరిట ఓ కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

అమెజాన్ పే ఈఎంఐలో..
భారత్‌లో అమెజాన్ యాప్‌ను వాడుతున్న మొబైల్ యాజర్లు యాప్‌లోకి వెళ్లి అమెజాన్ పే ఈఎంఐలో రిజిస్టర్ చేసుకోవాలి. అందుకు గాను వారు తమ తమ ఆధార్, పాన్ వివరాలను ఇవ్వాలి.

క్రెడిట్ లిమిట్..
దీంతో అమెజాన్ పే ఈఎంఐ క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయిస్తారు. అనంతరం నిర్దేశించిన మొత్తంలో క్రెడిట్ లిమిట్‌తో అమెజాన్ పే ఈఎంఐ యాక్టివేట్ అవుతుంది.

అకౌంట్‌కు డెబిట్ కార్డును లింక్
తరువాత యూజర్లు ఆ అకౌంట్‌కు తమ డెబిట్ కార్డును లింక్ చేయాలి. దీంతో ప్రాసెస్ పూర్తవుతుంది. తరువాత యూజర్లు అమెజాన్ పే ఈఎంఐ ఉపయోగించి అమెజాన్‌లో వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

కనీసం రూ.8వేలు..
అమెజాన్ పే ఈఎంఐ విధానంలో వస్తువులను కొనాలంటే యూజర్లు కనీసం రూ.8వేలు ఆపైన విలువైన ఒకే వస్తువును మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.

చెక్ అవుట్ చేసే సమయంలో..
అనంతరం చెక్ అవుట్ చేసే సమయంలో అమెజాన్ పే ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఆభరణాలు, గిఫ్ట్ కార్డులు..
ఆభరణాలు, గిఫ్ట్ కార్డులు, అమెజాన్ పే బ్యాలెన్స్‌కు అమెజాన్ పే ఈఎంఐ పనిచేయదని తెలుస్తోంది. కాబట్టి జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ బ్యాంక్ లకు మాత్రమే.. బ్యాంక్ లకు మాత్రమే..
ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లకు చెందిన ఖాతాదారులకు మాత్రమే అమెజాన్ పే ఈఎంఐ లభిస్తున్నది.

అమెజాన్ మొబైల్ యూజర్లకు మాత్రమే..
కేవలం అమెజాన్ మొబైల్ యూజర్లకు మాత్రమే ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు.త్వరలో ఫ్లిప్‌కార్ట్ కూడా ఇదే తరహాలో ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్, ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్ ఈఎంఐ పేరిట నూతన సదుపాయాలను ప్రవేశపెట్టనుందని సమాచారం.


Click it and Unblock the Notifications



