Amazon Sale: 25 వేల లోపు ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్!! మిస్ అవ్వకండి...
ఇండియాలో ప్రస్తుతం అమెజాన్ లో జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకం సమయంలో 25 వేల లోపు ధర వద్ద ఉత్మమమైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు ఉంటే కనుక ప్రస్తుతం అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. రూ.25,000 కంటే తక్కువ మరియు రూ.15,000 పైన గల బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవడానికి చూస్తున్నట్లు ఉంటే ఈ కింద గల జాబితాను పరిశీలించండి. ప్రస్తుత అమెజాన్ అమ్మకం సమయంలో యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల కొనుగోలు మీద 10% వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ తో పాటుగా ఎక్సచేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ M51 స్మార్ట్‌ఫోన్ మీద రూ.6,000 తగ్గింపు ఆఫర్
7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్, క్వాడ్-రియర్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్ సాధారణంగా రూ.30,999 ధర వద్ద జాబితా చేయబడి ఉంటుంది. కానీ ప్రస్తుత అమ్మకం సమయంలో రూ.6,000 తగ్గింపు పొందిన తర్వాత దీనిని రూ.24,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అదనంగా అమెజాన్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్
అమెజాన్ లో ప్రస్తుతం జరుగుతున్న అమ్మకాల సమయంలో రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ను రూ.2,991 ఫ్లాట్ డిస్కౌంట్ వద్ద విక్రయిస్తోంది. డిస్కౌంట్ తర్వాత మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ చేసిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G ప్రాసెసర్‌ను కలిగి ఉండి మిడ్-రేంజ్ హ్యాండ్‌సెట్ స్మార్ట్‌ఫోన్‌లలో అందరి కంటే ముందు వరుసలో గేమింగ్ ఫోన్‌లకు పోటీని ఇస్తున్నది.

శామ్‌సంగ్ గెలాక్సీ M31s
వాస్తవానికి రూ.22,999 ధర వద్ద లభించే శామ్‌సంగ్ గెలాక్సీ M31s ప్రస్తుత అమ్మకం సమయంలో రూ.4,500 ఫ్లాట్ డిస్కౌంట్ పొందిన తర్వాత ప్రస్తుతం కేవలం రూ.18,499 ధర వద్దనే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 5x ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఒప్పో F17 ప్రో దీపావళి ఎడిషన్ అమెజాన్ తగ్గింపు ఆఫర్
ఒప్పో F17 ప్రో దీపావళి ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత అమెజాన్ అమ్మకంలో రూ.2,000 తగ్గింపు తర్వాత కేవలం రూ.23,990 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే డిస్ప్లే మరియు క్వాడ్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంటుంది. అలాగే ఇది రూ.3,000 విలువైన పవర్ బ్యాంక్‌తో వస్తుంది.

Vivo V19 స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్
ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ అమ్మకం సమయంలో వివో V19 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు మీద రూ.6,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభించిన తరువాత రూ .24,990 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా దీని యొక్క ధర రూ.30,990 వద్ద జాబితా చేయబడి ఉంది.


Click it and Unblock the Notifications








