భారీ డిస్కౌంట్లతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Amazon మరో గ్రేట్ ఇండియన్ సేల్‌కు సిద్ధమవుతోంది. ఈ సేల్ ఆగష్టు 9 అర్థరాత్రి ప్రారంభమై ఆగష్టు 12 అర్థరాత్రితో ముగుస్తుంది. 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను పురస్కరించుకుని ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్‌బాస్టర్ డీల్స్

ఈ సేల్‌లో భాగంగా ఇప్పటి వరకు అందుబాటులో లేని బ్లాక్‌బాస్టర్ డీల్స్ అందుబాటులో ఉంటాయని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో భాగంగా అన్నిరకాల వస్తువుల పై బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉంటాయి.

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ను అమెజాన్ సిద్ధం చేస్తోంది. ప్రైమ్ యూజర్లకు 30 నిమిషాల ముందే టాప్ డీల్స్ అందుబాటులో ఉంటాయి.

15 శాతం వరకు క్యాష్ బ్యాక్స్

ఈ సేల్‌లో భాగంగా అందుబాటులో ఉంచే 'Amazon Pay balance only deals' పై 10 నుంచి 15శాతం క్యాష్ బ్యాక్స్ అందుబాటులో ఉంటాయి.

వారికి స్పెషల్ డీల్స్

అమెజాన్ యాప్ ద్వారా ఈ సేల్‌లో పాల్గొనే కస్టమర్‌లకు 'Guess Who' పేరుతో ప్రత్యేకమైన పజిల్ గేమ్ అందుబాటులో ఉంటుంది. ఈ గేమ్‌లోని పజిల్స్‌ను సాల్వ్ చేయటం ద్వారా స్పెషల్ డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ ఆగష్టు 7 నుంచి 8 మధ్య లైవ్‌లో ఉంటుంది.

బ్రాండెడ్ వస్తువుల పై భారీ డిస్కౌంట్లు

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ విషయానికి వచ్చేసరికి ఈ సేల్‌లో భాగంగా యాపిల్, వన్‌ప్లస్, సామ్‌సంగ్, లెనోవో, హెచ్‌పీ, టీసీఎల్, మైక్రోమాక్స్, బీపీఎల్, ఐఎఫ్‌బి తదితర బ్రాండ్‌లకు సంబంధించిన ఉత్పత్తుల పై బెస్ట్ డీల్స్‌ను అమెజాన్ అందుబాటులో ఉంచనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Great Indian Sale to Feature Discounts on Apple, OnePlus, and More. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot