జనవరి 20 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మరోసారి మన ముందుకు రాబోతోంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జనవరి 20 నుంచి 23 వరకు ఈ సేల్‌ను నిర్వహించబోతున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మరోసారి మన ముందుకు రాబోతోంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జనవరి 20 నుంచి 23 వరకు ఈ సేల్‌ను నిర్వహించబోతున్నట్లు అమెజాన్ వెల్లడించింది. నాలుగు రోజల పాటు నిర్వహించబడే ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులను పై భారీ నుంచి అతిభారీ డిస్కౌంట్లతో విక్రయించబోతున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి...
స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి ఆపిల్, వన్‌ప్లస్, షావోమి, హానర్, రియల్‌మి, సామ్‌సంగ్, టెన్.ఆర్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్ పై భారీ డిస్కౌంట్లతో పాటు స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ అందాుబాటులో ఉంటాయి. ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు విషయానికి వచ్చేసరికి ఎల్‌జి, వోల్టాస్, బీపీఎల్, హెచ్‌పి, కానన్ బ్రాండ్‌లకు సంబంధించిన ప్రొడక్ట్స్ పై ఆఫర్లు సిద్థమవుతున్నాయి.

అమెజాన్ తన సొంత బ్రాండ్‌లైన....
ఇదే సేల్‌లో భాగంగా అమెజాన్ తన సొంత బ్రాండ్‌లైన అమెజాన్ బేసిక్స్, సోలిమో, సింబల్, మిక్స్, విడాకా, ప్రిస్టోలకు సంబంధించి ఉత్పత్తులను డిస్కౌంట్ ధరల పై విక్రయించబోతోంది. అమెజాన్ ఇకో, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్ ఈరీడర్స్ వంటి అమెజాన్ డివైసెస్ పై రూ.3000 వరకు రాయితీలను పొందే వీలుంటుంది.

ల్యాప్‌టాప్‌ల పై...
ఇదే సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌ల పై రూ.30,000 వరకు తగ్గింపును ఆఫర్ చేయబోతున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్స్ పై 60 శాతం, రీఫ్రీజరేటర్స్ పై రూ.35,000 వరకు, టీవీల పై రూ.40,000 వరకు, ఎయిర్ కండీషనర్స్ పై రూ.25,000 వరకు డిస్సౌంట్స్ అందుబాటులో ఉంటాయని అమెజాన్ చెబుతోంది.

గ్రేట్ ఇండియన్ సేల్...
గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ అలానే క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేపట్టే కొనుగోళ్ల పై 10శాతం ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది. వీటితో పాటు నో కాస్ట్ ఈఎమ్ఐ, స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్ వంటివి అందుబాటులో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు 12 గంటల ముందుగానే గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








