అమెజాన్ సేల్ స్టార్టయింది, అర్థరాత్రి నుంచి డిస్కౌంట్ల హోరు !

By Hazarath
|

భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌తో అమెజాన్‌ గ్రేట్ ఇండియ‌న్ సేల్ మ‌రోసారి ముందుకు వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్ స‌భ్యుల‌కు ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గం.ల నుంచి ఇత‌రుల‌కు రాత్రి 12 గం.ల నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. కాగా జ‌న‌వ‌రి 24 వ‌ర‌కు ఈ సేల్ జ‌ర‌గ‌నుంది. మొబైల్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ల్యాప్‌టాప్‌లు, కిచెన్‌, గృహావ‌స‌రాల‌పై భారీ డిస్కౌంట్ల‌ను అమెజాన్ ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. దీంతో పాటుహెచ్‌డీఎఫ్‌సీ కార్డు మీద ప‌ది శాతం అద‌న‌పు క్యాష్‌బ్యాక్‌, అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వ‌నుంది. ప్రైమ్ స‌భ్యులు యాప్ ద్వారా త‌మ‌కు కావాల్సిన వ‌స్తువుల‌ను ముందుగా కార్ట్‌లో యాడ్ చేసుకుని, సేల్ అధికారికంగా ప్రారంభ‌మైన త‌ర్వాత డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంది.

 

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు , పరుగులు పెట్టనున్న మేక్ ఇన్ ఇండియా !భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు , పరుగులు పెట్టనున్న మేక్ ఇన్ ఇండియా !

Moto G5s Plus(Lunar Grey, 64GB)

Moto G5s Plus(Lunar Grey, 64GB)

అసలు ధర రూ. 16,999
డిస్కౌంట్ 18 శాతం
కొనుగోలు ధర రూ. 13,999
మోటో జీ5ఎస్ ప్ల‌స్ ఫీచ‌ర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, వాట‌ర్ రీపెల్లెంట్ నానో కోటింగ్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్.

InFocus Vision 3 (Midnight Black, 18:9 FullVision Display)
 

InFocus Vision 3 (Midnight Black, 18:9 FullVision Display)

అసలు ధర రూ. 7,999
డిస్కౌంట్ 13 శాతం
కొనుగోలు ధర రూ. 6,999
ఇన్‌ఫోకస్ విజన్ 3 ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Aadhaar ఇప్పటిదాకా ఎక్కడ వాడారో తెలుసుకోవడం ఎలా ? ( సింపుల్ ట్రిక్స్ )
Redmi Y1 (4+64GB)

Redmi Y1 (4+64GB)

అసలు ధర రూ. 11,999
డిస్కౌంట్ 8 శాతం
కొనుగోలు ధర రూ. 10,999
5.5 - ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్, ఆండ్రాయిడ్ నౌగట్ విత్ MIUI 8 స్కిన్ (త్వరలోనే MIUI 9 అప్‌డేట్), 1.4Ghz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు :f/2.0 అపెర్చుర్, 76.4 వైడ్ యాంగిల్ లెన్స్, సింగిల్ ఎల్ఈడి సెల్ఫీ లైట్, సెల్ఫీ కౌంట్ డౌన్, ఫేషియల్ రికగ్నిషన్), 13 మెగా పికస్ల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : పీడీఏఎఫ్ సపోర్ట్, లో లైట్ ఎన్‌హాన్స్‌మెంట్, హెచ్‌డీఆర్, రియల్ - టైమ్ ఫిల్టర్స్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్), ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 3080ఎంఏహెచ్ బ్యాటరీ. గోల్డ్ ఇంకా డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో ఈ ఫోన్ అందబాటులో ఉంటుంది.

Moto G5 Plus (32GB, Fine Gold)

Moto G5 Plus (32GB, Fine Gold)

అసలు ధర రూ. 16,999
డిస్కౌంట్ 35 శాతం
కొనుగోలు ధర రూ. 10,999
ఫోన్ స్పెసిఫికేషన్స్...
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2గిగాహెట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగ్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, 3000ఎమ్ఏహకచ్ బ్యాటరీ.

 LG V30+ (18:9, FullVision)

LG V30+ (18:9, FullVision)

అసలు ధర రూ. 60,000
డిస్కౌంట్ 25 శాతం
కొనుగోలు ధర రూ. 44,990
ఎల్‌జీ వీ30 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌ఎసీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల‌పై 40 శాతం డిస్కౌంట్లను..

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల‌పై 40 శాతం డిస్కౌంట్లను..

వ‌న్‌ప్ల‌స్ 5టీ లావా, ఆన‌ర్ వ్యూ10, ఎల్‌జీ వీ30 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ల‌పై కూడా అమెజాన్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. వ‌న్‌ప్ల‌స్‌, మోటోరోలా, శాంసంగ్‌, ఆపిల్‌, కూల్‌ప్యాడ్, ఎమ్ఐ, ఆన‌ర్ వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల‌పై 40 శాతం డిస్కౌంట్లను ప్రకటించింది.

ఎల‌క్ట్రానిక్స్‌పై 55 శాతం వ‌ర‌కు..

ఎల‌క్ట్రానిక్స్‌పై 55 శాతం వ‌ర‌కు..

కెమెరాలు, టీవీలు, వైఫై రూట‌ర్లు వంటి ఎల‌క్ట్రానిక్స్‌పై 55 శాతం వ‌ర‌కు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, మైక్రోవేవ్ ఓవెన్లు వంటి గృహోప‌క‌ర‌ణాల‌పై 50 శాతం వ‌ర‌కు, ఇక ఇత‌ర గృహావ‌స‌ర వ‌స్తువుల‌పై 75 శాతం వ‌ర‌కు, ఫ్యాష‌న్ బ్రాండ్ల‌పై 40-80 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు ఇవ్వ‌నున్న‌ట్లు అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Best Mobiles in India

English summary
Amazon Great Indian sale starts today, Prime members get early access at 12 PM More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X